Archive For The “వార్తలు” Category

చిన్న వెంకటస్వామి మృతి

By |

చిన్న వెంకటస్వామి మృతి

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ.సి.వెంకటస్వామిగా అందరికీ సుపరిచితులైన ఔకు చిన్న వెంకటస్వామి (81) మార్చి 12న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన నంద్యాల పురపాలక ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-1 హిందీ పండితులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఎందరో విద్యార్థులను చక్కని పౌరులుగా తీర్చిదిద్దారు. వారి కుటుంబం సంఘ కుటుంబంగా ఎందరో కార్యకర్తలను, ప్రచారకులనకు ఆదరించింది. సంతానం లేకున్నా జగమంతట కుటుంబంగా భావించి పరోపకార భావంతో అందరికీ ఆత్మబంధువుగా జీవించారు వెంకటస్వామి. నంద్యాలలో కీ.శే. కటకం నారాయణతో…

Read more »

కన్నుమూసిన ‘గోల్కొండ సింహం’

By |

కన్నుమూసిన ‘గోల్కొండ సింహం’

ముస్లిం ఇలాకా పాతబస్తీలో గర్జించిన హిందూ సింహం తన యాత్రను ముగించింది. హిందూజాతి కోసం.. హిందువుల మనుగడ కోసం తన తరంలో చేసిన యుద్ధం ఇక చాలంటూ శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ‘కార్వాన్‌ టైగర్‌’, ‘గోల్కొండ సింహం’.. అభిమానులు, అనుచరులు ఎలా పిలుచుకున్నా నేనున్నానంటూ అండగా నిలిచిన ఓ భరోసా కానరాని తీరాలకు పయనమైంది. హైదరాబాద్‌లో బీజేపీకి, హిందూ సమాజానికి అండగా నిలిచిన బద్ధం బాల్‌రెడ్డి అనారోగ్యంతో అస్తమించారు. కార్వాన్‌ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించారు…

Read more »

రాష్ట్ర సేవికా సమితి జ్యేష్ఠ కార్యకర్త శారదాబాయి కన్నుమూత

By |

రాష్ట్ర సేవికా సమితి జ్యేష్ఠ కార్యకర్త శారదాబాయి కన్నుమూత

తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర సేవికా సమితి నిర్మాణం, అభివృద్ధికి విశేషకృషి చేసిన జ్యేష్ఠ కార్యకర్త శ్రీమతి శారదాబాయి ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. హైదరాబాద్‌లో అలనాటి ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన దత్తాత్రేయ కులకర్ణి కుమార్తె శారదాబాయిని 1952లో ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు గణపతిరావ్‌ బ్రహ్మపూర్కర్‌ వివాహం చేసుకున్నారు. అనతికాలంలోనే తండ్రి అకాల మరణం చెందారు. దీనితో నలుగురి తమ్ముళ్ల బాధ్యత శారదాబాయి స్వీకరించారు. తరువాత పదో తరగతి చదువుకుని, ట్యూషన్లు చెప్పారు….

Read more »

సంరెడ్డి సుదర్శన్‌ రెడ్డి ఆకస్మిక మరణం

By |

సంరెడ్డి సుదర్శన్‌ రెడ్డి ఆకస్మిక మరణం

భాగ్యనగర్‌లోని మహావీర్‌ విద్యాసంస్థల స్థాపకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త సంరెడ్డి సుదర్శన్‌ రెడ్డి ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. 1952లో మార్చి 3న సంరెడ్డి ఆగిరెడ్డి, అంజమ్మ దంపతులకు జన్మించిన సుదర్శన్‌రెడ్డి యువకుడైన తరువాత 1968లో రాష్ట్రీయ స్వయంసేవక్‌గా సంఘ్‌లో చేరి వివిధ బాధ్యతలలో పనిచేశారు. కొంతకాలం భాగ్యనగర్‌ విభాగ్‌ శారీరక్‌ ప్రముఖ్‌ బాధ్యతలు నిర్వహించారు. బ్యాంక్‌ ఉద్యోగి సంస్థ ఎన్‌ఓబిడబ్ల్యు, కార్మిక సంస్థ బియంఎస్‌లో కూడా అనేక బాధ్యతలు…

Read more »

శబరిమల ఆందోళనకు మద్దతిద్దాం

By |

శబరిమల ఆందోళనకు మద్దతిద్దాం

శబరిమలలో హిందూ సమాజం మనోవేదనకు గురవుతోందని, అందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వమే కారణం అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తపరిచారు. అక్కడి హిందువులు చేస్తున్న ఆందోళన మిగతా హిందూ సమాజం మొత్తానికి సంబంధించినది అని, వారికి మనందరం మద్ద తివ్వాలి అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 1,2 తేదీ లలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధర్మసమ్మేళనం (ధర్మ సంసద్‌) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని…

Read more »

పార్లమెంట్‌లో ‘డైనమైట్‌’

By |

పార్లమెంట్‌లో ‘డైనమైట్‌’

ఇరవై ఒక్క మాసాలు దేశాన్ని అంధకారంలో మగ్గేటట్టు చేసిన ఆంతరంగిక అత్యవసర పరిస్థితి 1977 జనవరిలో తొలగిపోయింది. లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెసేతర పక్షాల కలయికతో జనతా పార్టీ అవిర్భవించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించారు. ఆ ఎన్నికలు స్వతంత్ర భారత చరిత్రలోనే కీలకమైనవి. ఊహించినట్టే వాటి ఫలితాలు భారత రాజకీయాలకి కొత్త దిశను నిర్దేశించాయి. కానీ, ముజఫర్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి జాడ లేదు. ఒక…

Read more »

నిరంతర ప్రేరణ పిళ్లా రామారావు

By |

నిరంతర ప్రేరణ పిళ్లా రామారావు

ఆయన వయసు అప్పటికి 92 ఏళ్లు. సంఘ్‌ కార్యక్రమాలలో నిక్కరు బదులు ప్యాంట్‌ ధరించే పద్ధతి ప్రవేశించింది. ఆ వేషధారణతోనే ఆయన శాఖా కార్యక్రమానికి హాజరయ్యారు. పైగా జీవితంలో మొదటిసారిగా ప్యాంటు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే విశాఖ ప్రముఖులు, తెలుగు ప్రాంతంలో ఆరంభం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కోసం అవిరళరగా శ్రమించిన పిళ్లా రామారావు. ఒక నిబద్ధతతో, కర్తవ్య నిష్టతో ఆర్‌ఎస్‌ఎస్‌ వెంట నడిచిన రామారావుగారు (95) ఫిబ్రవరి 3, 2019న విశాఖపట్నంలో వారి స్వగృహంలో తుదిశ్వాస…

Read more »

ఆధునిక ‘కశ్మీర్‌ సింహం’

By |

ఆధునిక ‘కశ్మీర్‌ సింహం’

నవంబర్‌ 25, 2018న ఆ ఘటన జరిగింది. షోపియాన్‌ జిల్లాలో హిరాపూర్‌ దగ్గర బతాగండ్‌ గ్రామంలో లష్కర్‌ ఏ తాయిబా ఉగ్రవాదులు దాగి ఉన్నారని తెలిసింది. భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. ఉగ్రవాదుల నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఆ బృందంలో సభ్యుడే నజీర్‌ అహమ్మద్‌ వాని (38). ఆయన సైన్యంలో లాన్స్‌ నాయక్‌ హోదాలో ఉన్నారు. లష్కర్‌ ఏ తాయిబా జిల్లా కమాండర్‌ ఉమర్‌ గనాయ్‌, మరో ఐదుగురు ఉగ్రవాదులతో భద్రతాదళాలు భీకరంగా పోరాడాయి. బుల్లెట్ల వర్షం…

Read more »

పద్మశ్రీ చాయ్‌వాలా

By |

పద్మశ్రీ చాయ్‌వాలా

”రావు సాబ్‌! మిమ్మల్ని కలవడానికే నేను ఇక్కడికొచ్చాను. మీ గురించి అంతా తెలుసుకున్నాను. మిమ్మల్ని నాకు ఎవరూ పరిచయం చేయనక్కరలేదు!” ఆ ‘రావు సాబ్‌’ అంటే దేవరపల్లి ప్రకాశ్‌రావు. ఒడిశాలోని కటక్‌లో బక్సీ బజార్‌లో చిన్న టీ దుకాణం నడుపుతారు. కానీ ఆయనను ‘మిమ్మల్ని కలవడానికే వచ్చాను’ అని చెప్పిన వారు మరొక ‘చాయ్‌వాలాయే’. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అపురూప ఘట్టం మే 26, 2018న కటక్‌లో జరిగింది. ఆ రోజు ప్రధాని…

Read more »

విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం

By |

విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం

విజయవాడ కేదారేశ్వరపేటలోని కృష్ణరాజ అపార్ట్‌మెంట్‌లో ‘సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రల్‌ స్పిరిట్‌’ పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ‘గ్రంధాలయం’ జనవరి 26న ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌గా, హిందూనగారా మాసపత్రిక సంపాద కులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి.వి.శ్రీరామశాయి స్వగృహంలో ఈ గ్రంథాలయాన్ని ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త పెరమారెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, ప్రముఖ రచయిత, హైదరాబాద్‌ నవభారతి ప్రచురణల నిర్వాహకులు వడ్డి విజయ సారధి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు. ప్రముఖ…

Read more »