Archive For The “వార్తలు” Category

సుధాకర్‌ పైప్స్‌ అధినేత కన్నుమూత

By |

సుధాకర్‌ పైప్స్‌ అధినేత కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్‌ పీవీసీ పైప్స్‌ అధినేత, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మీలా సత్యనారాయణ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. వద్ధాప్యం వల్ల ఉత్పన్నమైన అనారోగ్య సమస్యలతో పక్షం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 25న తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబంలో జన్మించి శ్రమనే నమ్మి నిరంతరం పరిశ్రమించి పారిశ్రామికవేత్తగా ఎదిగారు మీలా సత్యనారాయణ. స్వాతంత్య్రం అనంతరం రెండు పర్యాయాలు మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసి వేతనంతోపాటు ఎలాంటి సదుపాయాలను వినియోగించుకోకుండా…

Read more »

సేవకు ప్రతిరూపం – ఎస్‌టిజి రామచంద్రాచార్య

By |

సేవకు ప్రతిరూపం – ఎస్‌టిజి రామచంద్రాచార్య

వనవాసీ కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్‌ సహకార్యదర్శిగా గత 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన డా|| తిరుమల గుడిమెట్ల రామచంద్రాచార్య రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త వందలాదిమంది హృదయాలను కలచివేసింది. వారు విశాఖపట్నంలో 30 సంవత్సరాలు పనిచేసి గాయత్రీ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి గిరిజనుల సేవకై నిరంతరం పరితపించారు. ఆయన నేడు మన మధ్య లేకపోవడం సమాజకార్య ప్రగతికి తీరనిలోటు. విశాఖ జిల్లాలోని పాడేరు, మఠం…

Read more »

శ్రీరాముడు అందరివాడు

By |

శ్రీరాముడు అందరివాడు

అది భాగ్యనగర్‌ మహానగరం.. అంతటి మహానగరంలో సైదాబాద్‌ కాలనీలోని సింగరేణి కాలనీ అనే మురికివాడ. 2500 గుడిశెలు, 1770 ప్రభుత్వం కట్టించిన గృహాలు ఆ కాలనీలో ఉన్నాయి. ఆ బస్తీలో అనేక కుటుంబాలూ, అన్ని రకాల వ్యక్తులూ నివసిస్తుంటారు. వీరి మధ్య అనేక గొడవలూ జరుగుతాయి. సారా కాయడం, దొంగతనాలు వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలూ ఎక్కువే. పోలీసు వారి నేర రికార్డుల్లో సింగరేణి కాలనీలో నివసించే వారి పేర్లు అనేకం ఉంటాయి. ఈ బస్తీని పోలీసులు…

Read more »

అందరిని అక్కున చేర్చుకుందాం : శ్యామ్‌కుమార్‌

By |

అందరిని అక్కున చేర్చుకుందాం : శ్యామ్‌కుమార్‌

పాలమూరు : వసుధైక కుటుంబకం భావనతో అందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవనం సాగించాలని, ఏ ఒక్కరికి దుఃఖం కలుగకూడదని ఒక్క హిందూ ధర్మం మాత్రమే కోరుకుంటున్నదని ఆర్‌.ఎస్‌.ఎస్‌. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలె శ్యామ్‌కుమార్‌ అన్నారు. మహబూబ్‌ నగర్‌, బండమరిపల్లెలోని సాందీపని ఆవాసంలో 2019 ఏప్రిల్‌ 19, 20 తేదీలలో సేవాభారతి- తెలంగాణ ప్రాంత పూర్తి సమయ కార్యకర్తల సమావేశం జరిగింది.సమావేశాలను ప్రారంభిస్తూ శ్యామ్‌కుమార్‌, ‘సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయడం ద్వారా భారతదేశాన్ని…

Read more »

పేద విద్యార్థులకోసం మొబైల్‌ లైబ్రరీ వాహనం

By |

పేద విద్యార్థులకోసం మొబైల్‌ లైబ్రరీ వాహనం

దుండిగల్‌ : హైదరాబాద్‌ నగరంలోని మురికివాడల్లోని పిల్లలకు విద్యను అందించే దిశగా ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్షయవిద్య కేంద్రం కృషి చేస్తున్నది. దీనికి దుండిగల్‌ ఔటర్‌రింగ్‌రోడ్డు ప్రాంతంలో ఉన్న బిహెచ్‌ఈఎల్‌జీఈ టర్బైన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారు 15 లక్షల విలువ చేసే మొబైల్‌ టైబ్రరీ వాహనాన్ని బీజీజీటీఎస్‌ కర్మాగారంలో ఏప్రిల్‌ 19న అక్షయ విద్య సంస్థ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌ హ్యండ్స్‌ అధ్యక్షుడు జీవానంద్‌, శ్రీధరన్‌, లక్ష్మీకాంత్‌, చైతన్య, కిరణ్‌, బీజీజీటీఎస్‌…

Read more »

ఉచిత కంటి అద్దాల పంపిణి

By |

ఉచిత కంటి అద్దాల పంపిణి

నంద్యాల: సంఘమిత్ర సేవా సమితి, స్వామి నేత్రాలయం ఆధ్వర్యంలో డాక్టర్‌ యన్‌. సి. లక్మయ్య సహకారంతో నంద్యాల నగరంలోని సేవాబస్తీ బైటి పేటలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఏప్రిల్‌ 22న కంటి అద్దాలు ఉచితంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భవాని ప్రసాద్‌, డాక్టర్‌ లక్మయ్య, నంద్యాల జిల్లా సంఘచాలక్‌ డాక్టర్‌ ఉదయ్‌ శంకర్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆంధ్రప్రాంతసేవా ప్రముఖ్‌ కేశవయ్య, సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్‌, బండారు సుబ్బారావు,…

Read more »

జన జాగృతి

By |

హిందువులకు శుభవార్త భారతీయ జనతా పార్టీ ఈసారి మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణం దిశగా కృషి చేస్తామని చెప్పటం హిందువులకు శుభవార్తే. అయితే ఈసారి తప్పకుండా మందిరం నిర్మాణం అయ్యే విధంగా మోదీ ప్రయత్నిస్తారని నమ్ముతున్నాం. అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన స్థలంలో భవ్య రామమందిరం నిర్మాణం అయితే దేశానికి మంచి జరుగుతుంది. అనేక శతాబ్దాలుగా దేశంలో నలుగుతున్న ఒక పెద్ద సమస్యకు తెరపడుతుంది. దేశవ్యాప్తంగా హిందుత్వ వాతావరణం వెల్లివిరుస్తుంది. హిందుత్వ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా జీవించగలుగుతారు….

Read more »

కన్యాకుమారికి ఘన నివాళి

By |

కన్యాకుమారికి ఘన నివాళి

నర్సరావుపేట: పన్నెండేళ్ల పాటు రాష్ట్ర సేవికాసమితి ఆంధ్రప్రాంత సహకార్యవాహికగా సేవలు అందించిన కుమారి టి.కన్యాకుమారి మరణం సంస్థకు తీరని లోటని వక్తలు శ్రద్ధాంజలి ఘటించారు. నర్సరావుపేటలో మార్చి 29న కన్యాకుమారి సంస్మరణ సభ జరిగింది. రాష్ట్ర సేవికాసమితి ప్రముఖ కార్యవాహిక అన్నదానం సీతాగాయత్రి మాట్లాడుతూ కన్యాకుమారి మంచి వ్యక్తిత్వం కలిగిన సేవిక అని, తన సమస్యలను ఏనాడు వ్యక్తం చేసేవారు కాదనీ, కానీ ఎదుటివారి సమస్యలను తీర్చడానికి తన వంతు సాయం చేయడానికి మాత్రం ముందుండేవారనీ అన్నారు….

Read more »

నవ గోవా నిర్మాత పారికర్‌

By |

నవ గోవా నిర్మాత పారికర్‌

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని ప్రాధామ్యాలు నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశ భద్రత. యూపీఏ ప్రభుత్వంలో అంతగా పట్టించుకోని శాఖలలో ఒకటి రక్షణ శాఖ. కానీ మోదీ ఆ శాఖను బలోపేతం చేయవలసిన అవసరాన్ని వెంటనే గుర్తించారు. అందుకే గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పారికర్‌ (డిసెంబర్‌ 18, 1955-మార్చి 17, 2019) ను ఏరికోరి తెచ్చి ఆ పదవిలో ప్రతిష్టించారు. ఆయన మూడేళ్లు ఆ పదవిలో ఉన్నారు….

Read more »

సామాన్య జీవితం – ఉన్నత వ్యక్తిత్వం

By |

సామాన్య జీవితం – ఉన్నత వ్యక్తిత్వం

అది గోవా పనాజీ ప్రాంతం. ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర హెల్మెట్‌ పెట్టుకొని స్కూటర్‌పై గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనకనుంచి 25 సంవత్సరాల యువకుడు కారులో ఉండి పదే పదే హారన్‌ కొడుతున్నాడు పక్కకు తప్పకో అని. స్కూటర్‌పైనున్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు. వెంటనే కారులోని యువకుడు కిందకి దిగి కోపంగా ‘నేనెవరినో తెలుసా నీకు! ఈ ప్రాంత డిఎస్‌పి కొడుకుని! నాకే దారి ఇవ్వవా!’ అంటూ ఆ…

Read more »