Archive For The “బాల జాగృతి” Category

కలిసుంటే కలదు సుఖం !

By |

కలిసుంటే కలదు సుఖం !

రాము, రాజు ఇద్దరూ మంచి స్నేహితులు. మూడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు ఒకే కాలనీలో ఉంటాయి. రోజూ బడికి కలిసే వెళతారు, కలిసే తిరిగొస్తారు. అయితే ఒక రోజు సాయంత్రం రాము బడి నుంచి ఒంటరిగా రావడాన్ని గమనించిన రమ ‘ఏమైంది రాము ఈ రోజు నువ్వు స్కూల్‌ నుంచి ఒంటరిగా వచ్చావు. రాజు ఎక్కడికెళ్లాడు ?’ అని అడిగింది కొడుకుని. ‘ఈ రోజు నుండి నేను రాజుతో మాట్లాడను. వాడితో నా దోస్తీ కటీఫ్‌’…

Read more »

పిల్లలకు పనులు నేర్పడమెలా?

By |

పిల్లలకు పనులు నేర్పడమెలా?

నేటి రోజుల్లో పిల్లలు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా టివి చూస్తూనో, మొబెల్‌ ఫోన్లతో ఆడుతూనో ఉంటారు. వాటిల్లో మునిగిపోయి ఏదైనా పని చెప్తే ‘తర్వాత చేస్తాను, ఒక గంటాగి చేస్తాను’ వంటి సమాధానాలు చెప్తారు. దీనివల్ల పిల్లలకు పని పట్ల శ్రద్ధ, పెద్దల పట్ల గౌరవం తగ్గే అవకాశం ఉంది. అందుకే వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం అలవాటు చేయాలి. మరి అలాంటి ఎదిగే పిల్లలకు పనులను ఎలా నేర్పించాలి? బాల్యం నుంచే పిల్లలకు సరైన…

Read more »

పరీక్షలంటే భయమా?

By |

పరీక్షలంటే భయమా?

పిల్లలకు పరీక్షల సందడి మొదలైంది. పరీక్షలంటే పిల్లలకే కాదు వారి తల్లదండ్రులు కూడా ఆందోళన పడే కాలం ఇది. గడిచిన సంత్సరకాలమంతా ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ సమయంలో ఏకాగ్రతతో చదివితేనే మంచి మార్కులొస్తాయి. లేదంటే అంతే సంగతులు! సంవత్సరమంతా చదివింది ఒక ఎత్తైతే ఈ సమయంలో చదివింది మరో ఎత్తు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి? అని తెగ ఆందోళన పడుతుంటారు పిల్లలు. దాని వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు….

Read more »

పిల్లల్లో అతి బిడియం

By |

పిల్లల్లో అతి బిడియం

కొంతమంది పిల్లల్లో పెరిగేకొద్దీ ఆ స్వభావం క్రమేపి తగ్గిపోతుంది. మరికొంతమంది పిల్లల్లో వయసు పెరుగుతున్నప్పటికీ తమ స్వభావంలో మార్పు రాదు. అపరిచితులతో మాట్లాడటానికి బిడియ పడుతూంటారు. ఎదుటివారు పలకరిస్తే తల్లి వెనక దాక్కుంటారు. ఇంటికి వచ్చిన కొత్త వారి నుంచి తప్పించుకొని తిరుగుతూంటారు. నలుగురితో చేర కుండా, మాట్లాడటానికి మొహమాట పడుతూంటారు. ఈ స్వభావంతో పిల్లలు చురుకుగా ఉండలేరు. ఏ విషయాన్నీ తొందరగా తెలుసుకోలేరు. దానితో అది వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. పసి వయసులోనే పిల్లల్ని…

Read more »

హోంవర్క్‌ పిల్లలకు సమస్య అవుతోందా?

By |

హోంవర్క్‌ పిల్లలకు సమస్య అవుతోందా?

బడికెళ్లే పిల్లలు సాయంత్రం రాగానే తోటి వారితో కలిసి హాయిగా ఆడుకోవాలనుకుంటారు. అది గతం. కానీ నేడు పరిస్థితి మారింది. నేటి చదువుల ప్రభావంతో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు.  ఉదయాన్నే ఆదరాబాదరాగా తినేసి బండెడు పుస్తకాలతో, మోయలేని బరువున్న బ్యాగుతో స్కూలుకెళతారు. సాయంత్రం వచ్చీ రాగానే పుట్టెడు హోంవర్కు. ఇక సాయంకాలం ఆడుకోవటానికి తీరికేది. దానితో హోంవర్కును పిల్లలు ఇష్టంగా కాకుండా కష్టంగా భరిస్తున్నారు. కారణం వారి వయసుకు మించిన ఒత్తిడి. హోంవర్కు అనేది వారికి…

Read more »

‘హీరాఖాణి’ ద్వారం

By |

‘హీరాఖాణి’ ద్వారం

ఛత్రపతి శివాజి నిర్మించిన కోట రాయగఢ్‌. ఆ కోటకు ఒకే ఒక సింహద్వారం ఉంది. ఆ కోటలోకి రాకపోకలు సాగిం చేందుకు అదొక్కటే ద్వారం. ఎవరైనా ఆ ద్వారం గుండానే రావాలి, పోవాలి. అలా ప్రతిరోజూ కోట లోపలికి వచ్చి తమ పనులు చూసుకొని వెళ్ళేవారిలో హీరా ఖాణి అనే మహిళ కూడా ఉంది. కోటకు దగ్గరలో గల ఒక గ్రామంలో హీరాఖాణి జీవి స్తోంది. పాలు అమ్ము కోవడం ఆమె వృత్తి. రోజూ కోటలోకి వచ్చి…

Read more »

చంటి పిల్లలకు ఆహారం

By |

చంటి పిల్లలకు ఆహారం

శిశువుకు తల్లిపాలే ఉత్తమాహారం. పుట్టిన పిల్లలకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. కానీ తల్లి పాలలో ఆరు నెలలవరకే బిడ్డ పెరుగుదలకు సరిపడినన్ని పోషక పదార్థాలు ఉంటాయి. ఆ తర్వాత కూడా చంటి పిల్లాడు తల్లిపాల మీదే ఆధారపడితే, పెరుగుదలకు పోషకపదార్థాలు చాలక, అనేక జబ్బులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి బిడ్డ పెరుగుదలకు అనుగుణంగా ఆహారాన్ని మార్పు చేసుకుంటూ వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. శిశువు జన్మించగానే తల్లి ఒక చిక్కటి పాల…

Read more »

పిల్లలు క్రీడల పట్ల ఉత్సాహం చూపిస్తున్నారా?

By |

పిల్లలు క్రీడల పట్ల ఉత్సాహం చూపిస్తున్నారా?

పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇతర రంగాలలోకి ప్రవేశించి, వాటిలో ప్రావీణ్యత పొందేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారికి అభిరుచి, ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పించాలి. మానసిక వికాసానికీ, మేధాశక్తికీ చదువు ఎంత అవసరమో, పిల్లల శారీరక వ్యాయామానికీ, దృఢత్వానికీ ఆరోగ్యానికీ క్రీడలూ అంతే ముఖ్యమని పెద్దలు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి చూప కుండా టివి ముందు తిష్టవేయడం లేదా కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్స్‌లో గేమ్స్‌ ఆడటం పట్ల ఉత్సాహాన్ని…

Read more »

పసిపిల్లల చర్మ సంరకణ

By |

పసిపిల్లల చర్మ సంరకణ

పసిపిల్లల చర్మం అతి సున్నితంగానూ, ఎంతో మృదువుగానూ ఉంటుంది. పిల్లల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, సున్నితత్వాన్ని కాపాడటానికి, పాపాయి చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తల్లి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. పాపాయి చర్మం మూడు సంవత్సరాల వయస్సు వరకూ పూర్తిగా వికసించదు. అందువల్ల, చర్మానికి హాని కలిగే అవకాశా లుంటాయి. వ్యర్థపదార్థాలు, బాక్టీరియా పసిపిల్లల చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల, పసిపిల్లల చర్మ పరిశుభ్రత విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం అవసరం. పిల్లల చర్మం ఎంతో పలుచగా…

Read more »

పిల్లలలో అతి ప్రవర్తన

By |

పిల్లలలో అతి ప్రవర్తన

కొంతమంది ప్రతిదానికి అతిగా ప్రవర్తిస్తుంటారు. అంటే ఊరికే విసుక్కోవడం, ఏదైన విషయం పట్ల అతి చురుకు, అతి చొరవ చూపిస్తుంటారు. దీనినే వైద్యపరిభాషలో ఆటిజమ్‌ అని అంటారు. ఈ అతి ప్రవర్తన జన్యుపరంగా ఏర్పడుతుందనేది ఒక వాదన. ఈ ఆటిజమ్‌ అన్నది వ్యాధి కాదు, ఒక మానసిక లోపంగా గుర్తించవచ్చు. ఇది పిల్లల మానసిక ఎదుగుదలకూ, ఆలోచనా శక్తికీ కొంత లోపాన్ని కలిగించవచ్చు. దీనికి వైద్యచికిత్స అంటూ ప్రత్యేకంగా లేదు. పిల్లలలోని ఈ ఆటిజమ్‌ను వారి ప్రవర్తన…

Read more »