Archive For The “చరిత్ర” Category

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

By |

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

”నేను ఇవాళ విప్లవసేనతో తలపడ్డాను!” ప్రపంచ చరిత్ర నిర్ఘాంతపోయిన కిరాతకమది. అంతటి రక్తపాతానికి పాల్పడి కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనరల్‌ డయ్యర్‌, అమృత్‌సర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌కు పంపించిన నివేదికలో రాసిన మాటలివి. ”నీ నిర్ణయం, నీ చర్య తప్పుకాదు!” అన్నది లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సమాధానం. ఇంతకీ తాను తలపడ్డానని జనరల్‌ డయ్యర్‌ చెప్పిన ఆ విప్లవసేన ఏది? రౌలట్‌ చట్టం దారుణమని, ఆ చట్టం అమలు మరింత అవమానకరమని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరాయుధుల…

Read more »

ఫోన్‌ చార్జీలు తగ్గుతుంటే కరెంటు చార్జీలు పెరుగుతున్నాయి

By |

ఫోన్‌ చార్జీలు తగ్గుతుంటే కరెంటు చార్జీలు పెరుగుతున్నాయి

1951 నుండి 2019 మధ్య కాలంలో మన దేశంలో టెలిఫోన్‌లు 1200 రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో విద్యుత్‌ ఉత్పాదకత శక్తి సుమారు వందరెట్లు లోపు మాత్రమే పెరిగింది. టెలిఫోన్‌ రేట్లు నిరంతరం తగ్గిపోతూ, బీదవారికి కూడా అందుబాటులోకి వస్తూంటే విద్యుత్‌ రేటు 16 రెట్లు పెరిగింది. బీదవారు, రైతులు విద్యుత్‌ బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొంది. కారణం విద్యుత్‌ ఉత్పాదన, వితరణ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండటమే. భారతదేశంలో సాంకేతిక సరళీకృత ఆర్థిక వ్యవస్థలు తీసుకువచ్చిన…

Read more »

సంచార ఉపగ్రహాలు

By |

సంచార ఉపగ్రహాలు

నేడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ప్రసారాల యుగం నడుస్తున్నది. సాంకేతికతను మన జీవితంలో భాగం చేసుకున్నాము. ఈ సాంకేతిక ప్రసారాల వ్యవస్థకు మూలం మానవుడు తయారుచేసిన కృత్రిమ ఉపగ్రహాలు. వాటి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. గత 50 సంవత్సరాలలో జరిగిన సాంకేతిక విప్లవాలలో గణనీయమైనది పలు ప్రయోజనాలకై అంతరిక్షంలోని పంపబడుతున్న కృత్రిమ భూ ఉపగ్రహాలు (శాటిలైట్స్‌). మన నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాలలో భూమి మూడవది. భూమికి ఉపగ్రహం చంద్రుడు. భూమి నుండి…

Read more »

హిందువులు ఎవరినీ దూరం పెట్టకూడదు!

By |

హిందువులు ఎవరినీ దూరం పెట్టకూడదు!

ప్రజోపయోగ పౌర కార్య ప్రణాళికల విషయంలో కూడా పేష్వాలు, వారి సామంతులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అటక్‌, రామేశ్వరం మధ్య భూముల నుండి కప్పం రూపంలో ధనవాహినులు కానుకలుగా వచ్చి పునహా (పూనా) చేరుకున్నాయి. కానీ ఆ నిధులు వృధాగా మూల్గుతూ పడి ఉండలేదు. ఆ నిధులు మళ్లీ చెరువునీరు పంటకాలువల ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు పారినట్లు, హిందూస్థాన మంతటా ఉన్న తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రవహించి ప్రజోపయోగాన్ని కూర్చాయి. హిందూదేశం మొత్తం మహారాష్ట్రుల హిందూ సామ్రాజ్య పోషణ…

Read more »

పరిశోధన – పరికల్పన

By |

పరిశోధన – పరికల్పన

భారతదేశంలో జ్ఞానార్జనకై ఎందరో రుషులు, మునులు కృషి చేశారు. నేను ఎవరిని? ఆత్మకు, పరమాత్మకు, విశ్వానికీ గల సంబంధం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనగలిగారు. మనల్ని మనం తెలుసుగోగలిగితే విశ్వం స్థితి, పరిణామం, లయలను అర్థం చేసుకోగలం. మన ఉనికిని విశ్వానికి కారణమైన శక్తితో అనుసంధించగలం. ఇలాకాక ప్రకృతిపై పట్టుసాధించి, మానవ జీవితాన్ని సులభతరం చేయడం కోసం తెలుసుకోవడాన్నే విజ్ఞానం (Science)) అంటాం. విజ్ఞానం ద్వారా ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరులను మనకు కావలసిన…

Read more »

నెహ్రూ ఎంపిక అన్యాయ విజయం

By |

నెహ్రూ ఎంపిక అన్యాయ విజయం

మన దేశ ప్రప్రథమ ప్రధానమంత్రిగా పండిత నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక, ఎన్నిక అయినారని అందరూ అనుకుంటూ ఉంటారు. అదే కాంగ్రెస్‌ పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ జరిగిన వాస్తవం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో నెహ్రూగారు ప్రప్రథమ ప్రధాని అయినారు. ఇది చారిత్రక సత్యం అని అప్పటి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది ఏ సగటు మానవుడికైనా. 1946 ఏప్రిల్‌లో అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికల జరగాల్సి ఉంది. అప్పటి పార్టీ పెద్దల…

Read more »

లాల్‌బహదూర్‌ను ఎందుకు ప్రధానిని చేశారంటే….?

By |

లాల్‌బహదూర్‌ను ఎందుకు ప్రధానిని చేశారంటే….?

‘లాల్‌బహదూర్‌ను ప్రధానమంత్రి పీఠం మీద ప్రతిష్ఠించడమే ఇందిరాగాంధీకి మార్గం సుగమం చేయడానికి…’ ఈ వ్యాఖ్య ఆనాడు వినిపించినదే. అంటే శాస్త్రి మరణం తరువాత. అందుకే ప్రధాని అభ్యర్థిత్వంలో కోసం ఆమెతో పోటీ పడిన మొరార్జీ దేశాయ్‌ని కాంగ్రెస్‌ పెద్దలు ఓడించారన్నది పీవీ నరసింహారావు వంటి వారి అభిప్రాయంగా కనిపి స్తుంది. ఇదే విషయాన్ని ఆయన తన ఆత్మకథాత్మక నవల ‘ది ఇన్‌సైడర్‌’ రూపు కట్టించారు. ఇందిరపై పోటీకి దిగిన మొరార్జీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎందుకు అంతగా వెనక్కి…

Read more »

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ

By |

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ

ఆంధ్రరాష్ట్రం కోసం ప్రయత్నాలు భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత మద్రాసు నుండి విడివడి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక మరింత బలపడింది. ఆంధ్రరాష్ట్ర వాంఛ తెలుగువారిలో 1914 నుండే ఆంధ్రమహాసభ నిర్వహించిన అనేక సమావేశాలలో ఆమోదం పొందు తూనే ఉంది. స్వాతంత్రానంతరం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని పట్టాభి సీతారామయ్య వంటి నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 1947 ఏప్రిల్‌లో మద్రాసు రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలు చేయాలని తీర్మానించారు. జూన్‌ 17, 1948లో భారత రాజ్యాంగ…

Read more »