Archive For The “కథనాలు” Category

అందం… ఆరోగ్యం…

By |

అందం… ఆరోగ్యం…

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు మొదటగా గుర్తుకు వచ్చేది గోరింటాకే. అసలు గోరింటాకు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు.. ఎర్రటి చేతులతో నీ కంటే ఎక్కువ నాకే పండిందంటూ ఇతరులతో పోల్చుకుని మరీ మురిసి పోతుంటారు. ఇప్పుడంటే కోన్లు వచ్చాయి కానీ ఇదివరకు గ్రామాల్లో ప్రతి ఇంటి పెరటిలో గోరింటాకు చెట్టు ఉండేది. మహిళలు పండుగలకు, పూజలకు, శుభ కార్యాలకు గోరింటాకు పెట్టుకొని మురిసి పోతుంటారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగువారి సాంప్రదాయం. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు…

Read more »

సమాచారం – ప్రసారం

By |

సమాచారం – ప్రసారం

పూర్వం కాశీయాత్రకు వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడితో సమానం అనేవారు. అలాగే మక్కా యాత్రకు వెళ్లినవాడు తిరిగి వచ్చిన దాఖలాల్లేనట్లే చెప్పుకుంటారు. మనిషి తన తెలివితేటల ద్వారా నేటి సమాచార సాధనాలను సృష్టించాడు. మరి ప్రకృతిలో ఈ సమాచార ప్రసారం ఎలా జరుగుతుంది? కొంచెం ఉత్సాహాన్ని కలుగజేసే ప్రశ్న ఇది. మీరు చిన్నప్పుడు పంచతంత్ర కథలను వినే ఉంటారు. వినే ఉంటారు అని ఎందుకంటున్నానంటే కథలు వినటానికి బాగుంటాయి చదవటం కన్నా. వాటిలో ఒకటి చీమ, పావురం, వేటగాళ్ల…

Read more »

భేదం దృష్టిలోనే… సృష్టిలో కాదు

By |

భేదం దృష్టిలోనే… సృష్టిలో కాదు

మన దృష్టిని బట్టి తేడాలు కనిపిస్తాయి. అంతేతప్ప సృష్టిలో ఎటువంటి భేదాలు లేవు అని చెపుతూ దానికి సహదేవుడు వివిధమైన వాళ్లకి వివిధ రకాలుగా కనబడిన రీతి, ఆ రీతిని చెప్పటానికి తిక్కన అనుసరించిన పద్య శైలి ఈ వ్యాసంలో కనబడుతుంది. అంతేగాక ఒక వ్యక్తి పెద్దల వద్ద, ఇతర సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలనేదీ తెలుస్తుంది. క్రీ.శ.11వ శతాబ్దంలో ప్రారంభమైన ఆంధ్ర మహాభారత రచన ఆ తరువాత రెండు వందల ఏండ్లు ఆగిపోవడం ఆశ్చర్యకరమే కాదు, ఆందోళన…

Read more »

ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ

By |

ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ

ఎట్టకేలకు ఎండాకాలం ముగిసింది. ఎదురు చూడగా చూడగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎండల నుండి, ఉక్కపోత నుండి ఉపశమనం లభించినందుకు, మళ్లీ చల్లదనం తమ అనుభూతి లోకి వచ్చినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వర్షాలు తమతోపాటు వ్యాధులను వెంటపెట్టుకు వస్తాయి. వాటిలో అంటువ్యాధులు ప్రమాదకర మైనవి. ఆ అనుభవం కూడా అప్పుడే మనకు ఎదురవుతోంది. వర్షాలతో వచ్చే వ్యాధులు మొదట పిల్లలపై తమ ప్రభావం చూపిస్తాయి. జలుబు, దగ్గు, రకరకాల విష…

Read more »

కుహనా మేధావులకు చెంపపెట్టు సమాధానాలు

By |

కుహనా మేధావులకు చెంపపెట్టు సమాధానాలు

ఘటం భింద్యాత్‌ ఫటం ఛింద్యాత్‌ కుర్యాత్‌ గార్ధభ రోహణమ్‌ | ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషోభవ || ఇదొక సంస్కృత శ్లోకం. ‘ఎలాగోలా అందరి కళ్లల్లో పడు, ప్రసిద్ధుడవవ్వు, దానికోసం నడిరోడ్లపై కుండలు బ్రద్దలు కొట్టు, గుడ్డలు చించుకో, గాడిద ఎక్కి ఊరేగు!’. ఇదీ దాని అర్థం. శ్లోకంలో పేర్కొన్న ‘ప్రసిద్ధ’ పురుషులకి మనదేశంలో లోటు లేదు. ‘అందరిదీ ఓదారి – ఉలిపిరి కట్టది మరోదారి’ సామెత మాదిరిగా ఉంటుంది వీరి వ్యవహారం. జాతీయవాదానికి వ్యతిరేకులైన వీరిని…

Read more »

సరస్సులా కనిపిస్తుంది.. ప్రాణాలను హరిస్తుంది

By |

సరస్సులా కనిపిస్తుంది.. ప్రాణాలను హరిస్తుంది

సరస్సులా కనిపించడం కాదు, అది సరస్సే. దాని పేరు ‘కరచాయ్‌’. ఇది రష్యాలో ఉంది. ఈ సరస్సు సమీపంలో నిలబడ్డ నిండు ఆరోగ్యవంతు డైనా సరే గంటలోపు రక్తం కక్కుకుని కుప్పకూలి చావడం ఖాయం. 1951 నుండి ఈ సరస్సులో రష్యా ప్రభుత్వం రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలను విడిచిపెట్టడమే ఇంతటి విషమ పరిస్థితికి కారణం. దీనివలన ఆ సరస్సు, దాని చుట్టుపక్కల పరిస రాలు, గ్రామాలు, అక్కడికి దగ్గరలోని నదులూ విపరీతంగా కలుషితమయ్యాయి. మధ్య రష్యాలో గల…

Read more »

వేదాల్లో దేవతలు

By |

వేదాల్లో దేవతలు

రుద్రుడు వైదిక రుద్రుని పరిణామమే పౌరాణిక శివుడు. ఈ శివుడు ద్రావిడ మతంలో నుంచి తీసికొనబడినవాడు కాడు. వేదములందే పౌరాణిక శివుని చాయలు కనబడుతున్నవి. కొన్ని సూక్తాల్లో కనబడే భయంకరుడు, తామసవిశిష్టుడు ఐన రుద్రుడు పురాణాల్లో ప్రళయకాలంలోని నటరాజుగా మారినాడు. కేశినులు, నగ్నులు, వాతరశనులునైన మునులు ఆధ్యాత్మిక సామర్థ్యాలను రుద్రునితోపాటు విషం త్రాగటంచేత సంపాదించినారని ఋగ్వేదంలో కలదు. (కేశీ విషస్యపాత్రేణ యద్రుద్రేణా పిబత్యహ 10.136). ఇతరులతో కలిపి తను స్తోత్రం చేయటం రుద్రుని కిష్టం లేదు. ఇతనికి…

Read more »

సంచలనాల ‘స్మృతి’

By |

సంచలనాల ‘స్మృతి’

కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో బీజేపీ గెలవడమంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడినే ఓడించారామె. దీంతో దేశవ్యాప్తంగా ‘జెయింట్‌ కిల్లర్‌’గా పేరు తెచ్చుకున్నారు. భాజపాలో మరో కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా?! మోదీ క్యాబినెట్‌లో రెండోసారి కూడా చోటు దక్కించుకున్న భారతీయుల కోడలు, ఆ పార్టీ ఫైర్‌ బ్రాండ్‌ స్మృతి ఇరానీ. ఏళ్ల తరబడి అమేథిలో పాతుకుపోయిన కాంగ్రెస్‌ కుటుంబ వారసత్వ రాజకీయాలను పెకిలించే…

Read more »

ఇదేనా రేపటి చరిత్ర!

By |

ఇదేనా రేపటి చరిత్ర!

‘ఇవాళ్టి రాజకీయాలే రేపటి చరిత్ర’ అంటాడు కాలింగ్‌వుడ్‌. రాజకీయం వ్యవస్థను శాసిస్తుంది. తీర్చిదిద్దే బాధ్యత కూడా దానిదే. కాబట్టి రాజకీయాలు లేని సమాజాన్ని ఊహించలేం. మనందరినీ నడిపించేదీ రాజకీయమే. కాబట్టే రేపటిచరిత్ర అంటే ఇవాళ్టి రాజకీయాలు అంటూ సూత్రీకరించవలసి వచ్చింది. ఇక్కడే ఒక ప్రశ్న- ఈ సూత్రీకరణ ప్రకారం రేపటి భారతీయ చరిత్ర ఎలా ఉండబోతోంది? ఇది తలుచుకుంటే అనంతమైన క్షోభ తప్పదు. కారణం- ఇవాళ్టి భారత రాజకీయాలు, వాటి వికృత రూపం. సరిగ్గా ఆ రాజకీయాల…

Read more »

అలుపెరగని ఆ దేశ సేవకుడు ఇక లేరు

By |

అలుపెరగని ఆ దేశ సేవకుడు ఇక లేరు

రాజమండ్రి: ‘రాజేంద్ర’ పేరుతో అత్యవసర పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలోను, తరువాత దివిసీమ ఉప్పెన తదనంతర సేవలోను పాల్గొని అందరికి చిరపరిచితులైన ఎస్‌.టి.జి. రామచంద్రాచారి (64) జూన్‌ 6న రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందారు. ఉదయం శాఖకు హాజరై రోడ్డు దాటుతూ ఉండగా మోటర్‌ సైకిల్‌ ఢీ కొట్టడంతో తీవ్ర ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామచంద్రాచారి మచిలీపట్నం ఆంధ్రజాతీయ పాఠశాల, కళాశాలలో విద్యాభాసం…

Read more »