Archive For The “ముఖపత్ర కధనం” Category

మధ్యయుగాల నాటి మౌఢ్యం

By |

మధ్యయుగాల నాటి మౌఢ్యం

హిందూ దేవాలయాల మీద దాడి చేయడం, కూలగొట్టడం, దేవతల విగ్రహాలకు అపచారం తలపెట్టడం మధ్య యుగాల నాటి మహమ్మదీయ పాలకులు చేసిన వికృత చేష్టలు. అదొక మౌఢ్యం. అదొక అజ్ఞానం. అదొక చీకటి యుగం. కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కొందరు మతోన్మాదులు ఇలాంటి మౌఢ్యాన్నే ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. తద్వారా వారి మధ్యయుగపు మత విద్వేషాన్ని ఇప్పటికీ వదలుకోలేదని చెప్పక చెబుతున్నారు. అదే తమ ధోరణి అని నిస్సుగ్గుగా ప్రకటించుకుంటున్నారు కూడా. సాక్షాత్తు దేశ…

Read more »

కుట్రతోనే ముస్లిం మతోన్మాదుల దాడి

By |

కుట్రతోనే ముస్లిం మతోన్మాదుల దాడి

పాత ఢిల్లీలోని చాంద్‌నీ చౌక్‌ ప్రాంతంలో ‘దేవీ’ ఆలయముంది. జూన్‌ 30న కొందరు ముస్లింలు ‘అల్లాహో అక్బర్‌’ నినాదాలు ఇస్తూ, హిందువులను దూషిస్తూ చాంద్‌నీ చౌక్‌లోని లాల్‌ కువాకు చేరుకుని ఆ ఆలయ విధ్వంసానికి పూనుకున్నారు. చాంద్‌నీ చౌక్‌లో ముస్లింలదే మెజారిటీ. హిందువుల సంఖ్య నామమాత్రమే. ముస్లింలు దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా ఆ మందిర పరిసరాలలో నివసిస్తున్న హిందువుల వాహనాలను కూడా ధ్వంసం చేసారు. ఒక హిందూ యువకుడిని ఎత్తుకుపోయారు. హింసించి వదిలి పెట్టారు….

Read more »

అవినీతి భక్షిస్తుంది

By |

అవినీతి భక్షిస్తుంది

అవినీతికి పాల్పడటం, అలా లభించిన హోదా, అధికారాన్ని అనుభవించడం మొదట్లో చిన్నపిల్లవాడు పంచదార తిన్నంత హాయిగా ఉంటుంది. తరువాత ఆ అవినీతికి అలవాటు పడి, మానుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ అవినీతే భస్మాసుర హస్తంగా మారుతుంది. ప్రజాగ్రహమై కబళిస్తుంది. ఇక అప్పుడు ఎవరైనా, ఎంతటి నాయకుడైనా ఆ ఆగ్రహానికి గురయి, భస్మం కాక తప్పదు. చరిత్ర అనే మట్టితో కలిసి కొట్టుకుపోక తప్పదు. ప్రస్తుతం బెంగాల్‌లో నడుస్తున్న కట్‌మనీ వ్యవహారం మమత పట్ల భస్మాసుర హస్తమే…

Read more »

నానృషిః కురుతే కార్టూన్‌

By |

నానృషిః కురుతే కార్టూన్‌

‘కార్టూన్‌ ప్రక్రియ’ అనే ఆ రింగ్‌లోకి ఎవరొచ్చినా ఇక అంతే సంగతులు. ఎంతటి పాలక కొదమసింహాలైనా కొంటె బొమ్మలయ్యే సరికి వింత వింత విన్యాసాలు చేస్తాయి. మరెంతటి అధికారపక్ష బెబ్బులులైనా ‘గీత’ పుణ్యమా అని శాస్త్రీయ నృత్యాలు, రాక్‌లూ, షేక్‌లూ కూడా అలవోకగా ప్రదర్శిస్తాయి. ఇంకెంతటి ఉద్యమ దిగ్గజమైనా ‘రాత’ను బట్టి దండ కట్టుకుని బుద్ధిగా నిలబడుతుంది. ఇదంతా కార్టూన్‌ లేదా వ్యంగ్య చిత్రంలో కనిపించే ఆ రేఖల మహత్తు. అక్కడ కనిపించే ఆ నాలుగు పదాలూ…

Read more »

తెలుగు రాష్ట్రాల బాలారిష్టాలను నివారిస్తాం!

By |

తెలుగు రాష్ట్రాల బాలారిష్టాలను నివారిస్తాం!

భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికలలో ఓటర్లు 303 స్థానాలు అందించారు. కానీ దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ మాత్రమే భాజపా సభ్యులను లోక్‌సభకు పంపించాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభలో భాజపా తరఫున వాణిని వినిపించబోతున్నవారు ఆ నలుగురే. ఒక అద్భుత విజయంతో వారు లోక్‌సభలో అడుగుపెట్టారు. గంగాపురం కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), బండి సంజయ్‌ (కరీంనగర్‌), అర్వింద్‌ ధర్మపురి (నిజామాబాద్‌), సోయం బాపూరావు (ఆదిలాబాద్‌) ప్రమాణం చేసిన సందర్భంగా వారి మనోగతాలను జాగృతి అందిస్తున్నది….

Read more »

యువత గుండెల్లో మోదీ..

By |

యువత గుండెల్లో మోదీ..

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ కంచుకోట కరీంనగర్‌లో కాషాయజెండా ఎగిరింది. టీఆర్‌ఎస్‌ పార్టీ సెంటిమెంట్‌గా భావించే ఆ నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. మోదీ చరిష్మా, ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన గెలుపుకు కారణమంటున్న కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌తో జాగృతి ముఖాముఖి జరిపింది. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెంటిమెంట్‌, టీఆర్‌ఎస్‌ కంచుకోట కరీంనగర్‌ నుంచి…

Read more »

పతంజలి మహర్షికి ప్రణామాలతో…

By |

పతంజలి మహర్షికి ప్రణామాలతో…

‘యోగ’ ఇప్పుడు ప్రపంచం మొత్తం స్మరిస్తున్న మాట. దీని మూలం ‘యోగసూత్రాలు’ అనే గ్రంథం. యోగ అనే ప్రక్రియ సిద్ధాంతం, సాధన ఈ రెండింటిని వివరించే 196 సూత్రాల సంకలనమే ‘యోగసూత్రాలు’ గ్రంథం. కాబట్టే ఈ గ్రంథాన్ని పతంజలి యోగసూత్రాలు అని కూడా పిలుస్తారు. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగభ్యాసాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినవారు పతంజలి మహర్షి. ఈ దేశంలో యోగసాధన చరిత్రకు అందనంత పురాతన కాలం నుంచే ఉంది. గొప్ప కాలపరీక్షకు నిలిచిన అద్భుత ఆరోగ్య…

Read more »

నానమ్మాళ్‌… యోగవిద్యలో అద్భుతం

By |

నానమ్మాళ్‌… యోగవిద్యలో అద్భుతం

యోగ విద్యకు స్త్రీపురుష భేదం లేదు. వయసు కూడా పెద్ద ఆటంకం కాదు. ఈ విషయాన్ని అద్భుతంగా నిరూపించిన అద్భుత మహిళవి. నానమ్మాళ్‌. కోయంబత్తూరు కేంద్రంగా యోగాకు ఆమె అమోఘమైన సేవ అందిస్తున్నారు. యోగ విద్య ఔన్నత్యాన్ని చాటి చెప్పినందుకు 2018లో పద్మశ్రీ పురస్కారంఅందుకున్నారు. ఒక సమయంలో ఆమె రోజుకు యాభయ్‌ ఆసనాలు వేసేవారు. ఇప్పుడు మాత్రం 10 ఆసనాలు వేస్తున్నారు. ఆమె తన పదకొండవ ఏట యోగాభ్యాసం ఆరంభించారు. అసలు యోగ సాధనకు సమయం అంటూ…

Read more »

యోగం – అనాది జీవనవేదం

By |

యోగం – అనాది జీవనవేదం

మనసుకీ, శరీరానికీ మధ్య సామరస్యం ఉండాలని భారతీయ సంస్కృతి ప్రగాఢంగా విశ్వసించింది. శరీరమే కాదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలని దీనర్థం. మనసు అంటే ఆలోచనలు. దృష్టికోణం. దేహం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండి, ఆలోచనలు కూడా నిర్మాణాత్మ కంగా ఉంటే మనిషి మనీషిగా ఎదుగుతాడు. అలా కాకుండా దేహం ఆరోగ్యంగా ఉండి, ఆలోచనలు వికృతంగా ఉంటే మనిషిలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. మంచి ఆలోచనలు ఉన్నా, శరీరం సహకరించకపోతే ఆ ఆలోచనలు వ్యర్థం. కాబట్టే మనసుకీ, దేహానికీ…

Read more »

నిత్య ధర్మాలు – నిండైన ఆరోగ్యానికి మార్గాలు

By |

నిత్య ధర్మాలు – నిండైన ఆరోగ్యానికి మార్గాలు

మనది ఋషి సంప్రదాయం. మన ఋషులు మానవ జీవితం సార్థకం కావటానికి పురుషార్థాలను లక్ష్యంగా నిర్దేశించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే నాలుగింటినే పురుషార్థాలు అంటారు. ‘అర్థం’ అంటే డబ్బు లేక ఆస్తి లేక ఏదైనా సంపాదించే విషయంలోనూ; ‘కామ’ కోర్కెలు తీర్చుకునే విషయంలోనూ ధర్మంగా వ్యవహరించాలని, అప్పుడే ‘మోక్షం’ సిద్ధిస్తుందని వీటి అర్ధం. పురుషార్థ సాధకంగా జీవించటానికి మనిషికి ఆరోగ్యం ఎంతో అవసరం. అందుకే ‘ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమమ్‌’ అన్నారు. మన…

Read more »