Archive For The “ప్రత్యేక వ్యాసం” Category

వడ్ల ఒలుపు

By |

వడ్ల ఒలుపు

చైత్రమాసం! అక్కడ భద్రాద్రిలో సీతారామ కల్యాణ మహోత్సవానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ భీమవరం శ్రీరామ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రాములవారి కల్యాణానికి తలంబ్రాలు బియ్యం కోసం వడ్లు ఒలుపు గోదావరి ఒడ్డున ప్రారంభమైంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాది భక్తులు గోటితో ధాన్యం గింజలను ఒలిచే కార్యక్రమం ప్రారంభించారు. భక్తి ప్రపత్తులతో కోటి తలంబ్రాలను సిద్ధం చేసే విధంగా వ్యూహరచన చేశారు. ఇరవై బృందాలు ఈ బృహత్తర కార్యానికి నడుం బిగించాయి. భక్తులు శుచిగా…

Read more »

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

By |

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

”నేను ఇవాళ విప్లవసేనతో తలపడ్డాను!” ప్రపంచ చరిత్ర నిర్ఘాంతపోయిన కిరాతకమది. అంతటి రక్తపాతానికి పాల్పడి కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనరల్‌ డయ్యర్‌, అమృత్‌సర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌కు పంపించిన నివేదికలో రాసిన మాటలివి. ”నీ నిర్ణయం, నీ చర్య తప్పుకాదు!” అన్నది లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సమాధానం. ఇంతకీ తాను తలపడ్డానని జనరల్‌ డయ్యర్‌ చెప్పిన ఆ విప్లవసేన ఏది? రౌలట్‌ చట్టం దారుణమని, ఆ చట్టం అమలు మరింత అవమానకరమని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరాయుధుల…

Read more »

సులభ వైద్యం హోమియో

By |

సులభ వైద్యం హోమియో

హోమియో వైద్యంలో ప్రతి రోగికి మందు విడిగా ఉంటుంది. అంటే ఒకేరకం వ్యాధి వచ్చిన వారందరికీ ఒకే రకం మందు ఉండదు. మొదట రోగిని పరిశీలించి, తరువాత అతని రోగాన్ని పరిశీలించి మందు సూచిస్తారు. అంటే రోగి శారీరక, మానసిక వేదనలను సరిగా రాబట్టాలి. హోమియో వైద్యంలో రోగితత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. రోగిలోని ఏ అంశం అతని ఆరోగ్యాన్ని పాడుచేస్తుందో దానికి మాత్రమే మందు సూచిస్తారు. అల్లోపతి వైద్యం శాస్త్రపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ దీర్ఘకాల వ్యాధులకు అందులో…

Read more »

ఓటుహక్కు గురుతర బాధ్యత

By |

ఓటుహక్కు గురుతర బాధ్యత

ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి ప్రత్యేకం ప్రపంచ రాజకీయ, సామాజిక గమనంలో, అన్వేషణలో ఒక గొప్ప మజిలీ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నదని చెప్పుకోవడం ఈనాడు ఎన్నో దేశాలు సగర్వంగా భావిస్తున్నాయి. ప్రజాస్వామ్య స్థాపన దిశగా ఉద్యమిస్తున్నాయి. వ్యవస్థ సమగ్రాభివృద్ధికి, వికాసానికి ప్రజాస్వామ్యం ఒక తిరుగులేని ఆయుధంగా ప్రపంచ దేశాలు విశ్వ సిస్తున్నాయి. భారతదేశం స్వరాజ్యం సంపాదించిన కాలానికి ప్రజాస్వామ్యం ఒక విజయవంతమైన రాజకీయ సిద్ధాంతంగా ఆవిర్భవించడం, దానినే మనం నెలకొల్పుకోవడం జరిగిపోయాయి. కాని, మన ప్రజా…

Read more »

వాళ్లకు మాత్రమే ఆ స్వేచ్ఛ

By |

వాళ్లకు మాత్రమే ఆ స్వేచ్ఛ

‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకుడు అనే మహా మేధావి కనిపిస్తాడు. ఆయన ఒక అసాధారణ సిద్ధాంతాన్ని ఈ లోకం మీదకి వదిలిపెట్టాడు. వేసేవి సంస్కృత నాటకాలే అయినా గిరీశం వంటివారి నీడ పడి, వ్యక్తీకరణకి ఆంగ్లాన్ని ఆశ్రయించడం నేర్చాడు. అర్థం కాకపోయినా పదాలు గంభీరంగా ఉంటాయి. దాంతో అవతలి వాళ్లని డంగైపోయేటట్టు చేయవచ్చు కదా! నాచ్‌ అనగా, వేశ్య. యాంటీ నాచ్‌ అనగా వేశ్యావృత్తిని నిర్మూలించాలని కంకణం కట్టుకోవడం. ఈ యాంటీ నాచ్‌ వ్రతం పాటిస్తున్న వారి వైవిధ్యం…

Read more »

యుగద్రష్ట డా|| హెడ్గెవార్‌

By |

యుగద్రష్ట డా|| హెడ్గెవార్‌

ఉగాది నాడు డాక్టర్‌జీ జయంతి సందర్భంగా డాక్టర్‌ కేశవరావు బలీరాంపత్‌ హెడ్గెవార్‌ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంస్థాపకులు. గొప్ప విశ్వాసాన్ని గుండె నిండా నింపుకుని, సంఘ మంత్రాన్ని ప్రవచించి నిద్రాణమైన హిందూ జాతిని మేల్కొల్పినవారాయన. సంఘ తంత్రానికి వారే సృష్టికర్త. విలక్షణమైన సంఘ కార్యపద్ధతితో హిందూ జాతిని సంఘటితం చేయడంలో విజయం సాధించిన మహోన్నతుడు. అసాధ్యం సాధ్యమైంది హిందూ సంఘటన అసంభవమని, ‘హిందూ జాతికి మరణమే శరణ్యమని’, ‘దీనిని ఎవరూ రక్షించలేర’ని నిరాశలో కూరుకుపోయిన రోజులవి. డాక్టర్‌…

Read more »

ఘన చరితకు పునాది.. ఉగాది!

By |

ఘన చరితకు పునాది.. ఉగాది!

ఉగాది.. చెట్లు చిగురిస్తాయి.. వసంతం వెల్లివిరుస్తుంది.. పచ్చదనంతో, పచ్చికలతో నేల పులకరిస్తుంది.. కోకిలల కుహు.. కుహు.. రాగాలతో, బడికి సెలవు లొచ్చి ఊళ్లకెళ్లిన పిల్లల ప్రతిరాగాలతో ప్రకృతి పరవ శిస్తుంది. మామిడి పిందెలన్నీ పండటానికి సిద్ధమవు తాయి. పుల్లపుల్లగా నోరూరిస్తాయి. వేపచెట్టు సైతం శ్వేత వర్ణమై పూలు పూయిస్తుంది. మొత్తం ప్రకృతే పండుగ చేసుకుంటుంది. అందుకే ఉగాది భారత దేశానికి కొత్త సంవత్సరం అయింది. అందుకే భారతీ యులు ఉగాది ముహూర్తాన్ని శుభకార్యాల ప్రారంభానికి సరైనదిగా భావించారు….

Read more »

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు – 2019

By |

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు – 2019

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 8,9,10 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగాయి. అక్కడి కేదార్‌దామ్‌ సరస్వతీ శిశుమందిర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశాలను 8వ తేదీ ఉదయం సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌, సర్‌కార్యవాహ భయ్యాజీ జోషిలు భారతమాతా పటానికి పూలమాల సమర్పించి ప్రారంభించారు. ఈ సమావేశాల విశేషాలను పాఠకులకు అందిస్తున్నాం. వార్షిక నివేదిక శ్రద్ధాంజలి 2018 ప్రతినిధి సభల నుండి 2019 ప్రతినిధి సభల మధ్యకాలంలో దేశంలోని…

Read more »

నీటి బొట్టు – ముందు తరాలకు మెట్టు

By |

నీటి బొట్టు – ముందు తరాలకు మెట్టు

మార్చి 22 ప్రపంచ జలదినోత్సవ ప్రత్యేకం జలం.. జీవం.. జగం.. జలం లేనిదే జీవం లేదు, జీవం లేనిదే జగమే లేదు.. అంటే ఈ జగంలో జీవం ఉండటానికి జలమే కారణం. జీవులకు జలం ఎంత ప్రధానమైనదో ఈ వాక్యాలు చూస్తే తెలుస్తోంది. ప్రకతిలో పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమైనవి. ఇందులో జల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిండి లేకుండా కొన్ని వారాలైనా మనిషి బ్రతకగలడు,…

Read more »

సమర పతాకకు సలాం చేద్దాం !

By |

సమర పతాకకు సలాం చేద్దాం !

నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో అజాద్‌ హింద్‌ ప్రవాస ప్రభుత్వం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచాయని, ఈ చారిత్రక ఘట్టాన్ని దేశ ప్రజలు, ప్రధానంగా యువత స్మరించుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌కార్యవాహ్‌ సురేశ్‌ జోషీ (భయ్యాజీ జోషీ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంఘ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్వాలియర్‌లో మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభలో…

Read more »