Archive For The “ప్రత్యేక వ్యాసం” Category

వ్యాసాయ… విష్ణురూపాయ

By |

వ్యాసాయ… విష్ణురూపాయ

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ || వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునకు పుత్రుడు, శుక మహర్షికి తండ్రియైన తపోనిధుడు, కల్మష రహితుడైన వ్యాసునకు నమస్కారం అని ప్రతి భారతీయుడు ప్రతినిత్యం నమస్కరించవలసిన వ్యక్తి వేదవ్యాసుడు. కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా ఆ మహర్షిని స్మరించి ఋణం తీర్చుకోవాలి. అటువంటి రోజే ఆషాఢ పూర్ణిమ లేక గురుపూర్ణిమ. వ్యాస పూర్ణిమగా లోక ప్రసిద్ధి. ఆషాఢ పూర్ణిమనాడు వ్యాసుల…

Read more »

బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా..

By |

బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా..

”యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!” సర్వ ప్రాణుల్లోనూ మాతృరూపంగా ఉన్న ఆ జగన్మాతకు నమస్కారములు అని చెప్పడమే ఈ శ్లోక భావం. సకల ప్రాణులకూ తల్లే మూలం అని దీని పరమార్థం. మాతృశబ్దం ఎంత గొప్పదో అంత బాధ్యతాయుతమైనది. బిడ్డలకు జన్మనివ్వడమే కాదు, వారిని తల్లి పెంచి పోషిస్తుంది. అందుకే సకల చరాచర సృష్టిలో జీవులన్నీ తల్లినే ఆశ్రయిస్తాయి. సర్వలోకాలకు తల్లి ఆ జగజ్జనని. ఆదిపరాశక్తి కాబట్టే…

Read more »

తొలి పర్వదినం

By |

తొలి పర్వదినం

సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యం కూడా తప్పకుండా ఉంటుంది. మన పండుగలన్నీ తిథుల ప్రకారమే ఉంటాయి. ప్రతి తిథిలో ఏదో ఒక పండుగ ఉంటుంది. అలాగే మనం కూడా ఏ పనిచేసినా తిథుల ప్రకారమే చేస్తాం. అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి హిందువులకు పర్వదినం. దీనికి ఎంతో విశిష్టత ఉంది. మన పంచాంగం ప్రకారం నెలకు రెండు…

Read more »

నరేంద్ర మోదీ కొత్త కొలువు

By |

నరేంద్ర మోదీ కొత్త కొలువు

భారతదేశం పటం తీసుకుని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గ సభ్యుల నియోజక వర్గాలను భౌగోళికంగా గుర్తిస్తే ఒక అద్భుతం కళ్లకు కడుతుంది. ఆ సేతుశీతాచల పర్యంతం ఆ నియోజకవర్గాలు విస్తరించి ఉంటాయి. అది మోదీ మంత్రివర్గ కూర్పులోని నేర్పు. అంతేకాదు, ఇదే మరొక తిరుగులేని వాస్తవాన్ని కూడా వెల్లడిస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, బంగాళం నుంచి గుజరాత్‌ వరకు తన ఉనికిని తిరుగులేకుండా చాటుకుంటున్నది. ఇప్పుడు భారతావని అంతటా రెపరెపలాడుతున్నది…

Read more »

స్వాభిమానానికి పట్టాభిషేకం

By |

స్వాభిమానానికి పట్టాభిషేకం

జూన్‌ 15 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, హిందూ సామ్రాజ్య దినోత్సవం సమీపగతం నుంచి భారతీయులు ఇప్పటికీ ఒక సమర గీతిక వింటూనే ఉంటారు. విని ఉప్పొంగిపోతారు. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్నీ, ఆ ఉత్సవం వెనుక ఉన్న మహోన్నత కృషినీ, ఆశయాన్నీ, నాటి చారిత్రక పరిస్థితులనీ మన కళ్లకు కట్టే గీతమది. ఆ గీతికలో కథానాయకుడే ఛత్రపతి శివాజీ మహరాజ్‌. శివాజీ పట్టాభిషేక మ¬త్సవం జరిగిన తేదీనే (జూన్‌ 6,1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) ఇప్పటికీ మనం హిందూ…

Read more »

అందమైనది బాల్యం.. వీరికేమో బలిపీఠం

By |

అందమైనది బాల్యం.. వీరికేమో బలిపీఠం

జూన్‌ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బాల్యం.. జీవితంలో అదో అపూర్వ ఘట్టం. జీవిత చరమాంకం దాకా తీపి గురుతులను మరిచిపోలేని మధుర జ్ఞాపకం. పొత్తిళ్ల నుంచి మొదలుకొని తనంతట తానుగా అడుగులు వేస్తూ నడవడం.. ఆ తర్వాత యుక్తవయస్సు వచ్చేదాకా.. అమ్మ కొంగుచాటున, నాన్న వేలు పట్టుకొని ఎదగడం.. అందుకే ఆ కాలం ఎంతో మధురం. పూర్తిగా ఎదుటివాళ్లమీదనే ఆధారపడి కష్ట నష్టాలు తెలియకుండా, బాధ్యతలు లేకుండా హాయిగా గడిచిపోయే వయసు బాల్యం….

Read more »

జాతీయ స్ఫూర్తి మీద చెరగని జాడ

By |

జాతీయ స్ఫూర్తి మీద చెరగని జాడ

మే 28 సావర్కర్‌ జయంతి చరిత్ర ఆధారంగా, అది ఇచ్చిన గుణపాఠాల ఆధారంగా భారతదేశ రాజకీయాలు, ఉద్యమాలు నిర్మించాలని భావించిన వాస్తవికవాది స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌. ఆ పంథాలోనే స్వాతంత్య్రం సాధించాలని నమ్మినవారాయన. హిందూజీవన విధానాన్ని హిందుత్వగా భావన చేయడంలో ఆయన ఉద్దేశం కూడా అదే. వీర సావర్కర్‌ ఆలోచనా విధానాన్ని, జాతీయ కాంగ్రెస్‌ పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల ఆయన వ్యతిరేకతని అంచనా వేసేటప్పుడు 1936 మొదలు, 1947 వరకు కనిపించే నాటి భారత రాజకీయ,…

Read more »

మన్యంవీరులు

By |

మన్యంవీరులు

మే 7వ తేదీ అల్లూరి శ్రీరామరాజు వర్ధంతి బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. ఉత్తర భారతంలో బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. విశాఖ మన్యంలో జరిగిన మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897- మే 7, 1924)….

Read more »

స్వేచ్ఛ కావాలి, బాధ్యత ఉండాలి

By |

స్వేచ్ఛ కావాలి, బాధ్యత ఉండాలి

మే 3 అంతర్జాతీయ పత్రికా దినోత్సవం నేటి ప్రపంచంలో ఆధునికతకు కొలబద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇక, ఆధునిక ప్రపంచాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపించిన ఘనత వార్తా పత్రికలకే దక్కుతుంది. ప్రపంచంలో వచ్చిన ఏ ఉద్యమమైనా వార్తాపత్రికల చేయూత లేకుండా, ప్రమేయం లేకుండా జరగలేదన్నది సత్యం. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలోను పత్రికల పాత్ర విస్మరించలేనిది. ఆ విధంగా ప్రజాస్వామ్యానికి పత్రికా ప్రపంచం, పత్రికా ప్రపంచానికి ప్రజాస్వామ్యం పరస్పరం రక్షణ కవచాలుగా నిలబడిన సంగతి చరిత్ర వెల్లడిస్తున్నది. కానీ ప్రజాస్వామ్య…

Read more »

రామాయణం- ఆధునిక జీవనం

By |

రామాయణం- ఆధునిక జీవనం

భారతీయ సంస్కతికి మూలస్తంభాల వంటి గ్రంథాలు మూడున్నాయి. అవే రామాయణ, భారత, భాగవతాలు. వీటిలో భారతం మన నిజ జీవితం. రామాయణం ఆదర్శజీవితం. భాగవతం దివ్య జీవితం. మనం నిజ జీవితంలో ఎన్ని రకాల రాగద్వేషాలతో కొట్టుకు పోతున్నామో భారతం చెబుతుంది. మనం ఎంత ఆదర్శప్రాయమైన జీవితం గడపవచ్చో రామాయణం తెలియజేస్తుంది. ఏ రకంగా జీవిస్తే మనం దివ్య జీవితం గడపగలుగుతామో భాగవతం బోధిస్తుంది. ఆయా గ్రంథాలలో పాత్రలు, ప్రవత్తులు, కథలు, సందర్భాలు అన్నీ ఈ ఆశయాలకి…

Read more »