Archive For The “ఆరోగ్యం” Category

అందం… ఆరోగ్యం…

By |

అందం… ఆరోగ్యం…

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు మొదటగా గుర్తుకు వచ్చేది గోరింటాకే. అసలు గోరింటాకు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు.. ఎర్రటి చేతులతో నీ కంటే ఎక్కువ నాకే పండిందంటూ ఇతరులతో పోల్చుకుని మరీ మురిసి పోతుంటారు. ఇప్పుడంటే కోన్లు వచ్చాయి కానీ ఇదివరకు గ్రామాల్లో ప్రతి ఇంటి పెరటిలో గోరింటాకు చెట్టు ఉండేది. మహిళలు పండుగలకు, పూజలకు, శుభ కార్యాలకు గోరింటాకు పెట్టుకొని మురిసి పోతుంటారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగువారి సాంప్రదాయం. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు…

Read more »

ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ

By |

ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ

ఎట్టకేలకు ఎండాకాలం ముగిసింది. ఎదురు చూడగా చూడగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎండల నుండి, ఉక్కపోత నుండి ఉపశమనం లభించినందుకు, మళ్లీ చల్లదనం తమ అనుభూతి లోకి వచ్చినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వర్షాలు తమతోపాటు వ్యాధులను వెంటపెట్టుకు వస్తాయి. వాటిలో అంటువ్యాధులు ప్రమాదకర మైనవి. ఆ అనుభవం కూడా అప్పుడే మనకు ఎదురవుతోంది. వర్షాలతో వచ్చే వ్యాధులు మొదట పిల్లలపై తమ ప్రభావం చూపిస్తాయి. జలుబు, దగ్గు, రకరకాల విష…

Read more »

పతంజలి మహర్షికి ప్రణామాలతో…

By |

పతంజలి మహర్షికి ప్రణామాలతో…

‘యోగ’ ఇప్పుడు ప్రపంచం మొత్తం స్మరిస్తున్న మాట. దీని మూలం ‘యోగసూత్రాలు’ అనే గ్రంథం. యోగ అనే ప్రక్రియ సిద్ధాంతం, సాధన ఈ రెండింటిని వివరించే 196 సూత్రాల సంకలనమే ‘యోగసూత్రాలు’ గ్రంథం. కాబట్టే ఈ గ్రంథాన్ని పతంజలి యోగసూత్రాలు అని కూడా పిలుస్తారు. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగభ్యాసాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినవారు పతంజలి మహర్షి. ఈ దేశంలో యోగసాధన చరిత్రకు అందనంత పురాతన కాలం నుంచే ఉంది. గొప్ప కాలపరీక్షకు నిలిచిన అద్భుత ఆరోగ్య…

Read more »

నానమ్మాళ్‌… యోగవిద్యలో అద్భుతం

By |

నానమ్మాళ్‌… యోగవిద్యలో అద్భుతం

యోగ విద్యకు స్త్రీపురుష భేదం లేదు. వయసు కూడా పెద్ద ఆటంకం కాదు. ఈ విషయాన్ని అద్భుతంగా నిరూపించిన అద్భుత మహిళవి. నానమ్మాళ్‌. కోయంబత్తూరు కేంద్రంగా యోగాకు ఆమె అమోఘమైన సేవ అందిస్తున్నారు. యోగ విద్య ఔన్నత్యాన్ని చాటి చెప్పినందుకు 2018లో పద్మశ్రీ పురస్కారంఅందుకున్నారు. ఒక సమయంలో ఆమె రోజుకు యాభయ్‌ ఆసనాలు వేసేవారు. ఇప్పుడు మాత్రం 10 ఆసనాలు వేస్తున్నారు. ఆమె తన పదకొండవ ఏట యోగాభ్యాసం ఆరంభించారు. అసలు యోగ సాధనకు సమయం అంటూ…

Read more »

యోగం – అనాది జీవనవేదం

By |

యోగం – అనాది జీవనవేదం

మనసుకీ, శరీరానికీ మధ్య సామరస్యం ఉండాలని భారతీయ సంస్కృతి ప్రగాఢంగా విశ్వసించింది. శరీరమే కాదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలని దీనర్థం. మనసు అంటే ఆలోచనలు. దృష్టికోణం. దేహం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండి, ఆలోచనలు కూడా నిర్మాణాత్మ కంగా ఉంటే మనిషి మనీషిగా ఎదుగుతాడు. అలా కాకుండా దేహం ఆరోగ్యంగా ఉండి, ఆలోచనలు వికృతంగా ఉంటే మనిషిలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. మంచి ఆలోచనలు ఉన్నా, శరీరం సహకరించకపోతే ఆ ఆలోచనలు వ్యర్థం. కాబట్టే మనసుకీ, దేహానికీ…

Read more »

నిత్య ధర్మాలు – నిండైన ఆరోగ్యానికి మార్గాలు

By |

నిత్య ధర్మాలు – నిండైన ఆరోగ్యానికి మార్గాలు

మనది ఋషి సంప్రదాయం. మన ఋషులు మానవ జీవితం సార్థకం కావటానికి పురుషార్థాలను లక్ష్యంగా నిర్దేశించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే నాలుగింటినే పురుషార్థాలు అంటారు. ‘అర్థం’ అంటే డబ్బు లేక ఆస్తి లేక ఏదైనా సంపాదించే విషయంలోనూ; ‘కామ’ కోర్కెలు తీర్చుకునే విషయంలోనూ ధర్మంగా వ్యవహరించాలని, అప్పుడే ‘మోక్షం’ సిద్ధిస్తుందని వీటి అర్ధం. పురుషార్థ సాధకంగా జీవించటానికి మనిషికి ఆరోగ్యం ఎంతో అవసరం. అందుకే ‘ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమమ్‌’ అన్నారు. మన…

Read more »

శరీరం లోపలా శుద్ధి చేసే ‘క్రియలు’

By |

శరీరం లోపలా శుద్ధి చేసే ‘క్రియలు’

మన శరీర శుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేస్తాం. స్నానం శరీర బాహ్య శుభ్రతకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ స్నానం చేసిన తరువాత శరీరం ఎంతో హాయిగా, ఆనందంగా, గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. మరి శరీరం లోపలి సంగతేమిటి ? దానిని ఎవరు శుభ్రం చేస్తారు ? ఎలా చేస్తారు ? బాహ్య శరీరం శుభ్రమైతేనే అంతటి హాయి గొలిపితే, మరి లోపలి శరీరం కూడా శుభ్రపడుతుంటే ఇంకెంతటి హాయి గొలుపుతుందో కదా ! శరీరం లోపల…

Read more »

యోగమూర్తి జనార్దనస్వామీజీ

By |

యోగమూర్తి జనార్దనస్వామీజీ

భరతఖండంలో జనించిన సనాతన యోగాభ్యాసాన్ని అత్యాధునిక ప్రపంచానికి పరిచయం చేయడమనే చరిత్రాత్మక ఘట్టం ఒక స్వయం సేవక్‌ ప్రధాని పదవిని అధిష్టించిన తరువాత జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ యోగ విద్యకు చేరువయ్యారు. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలను యోగవిద్యతో సుసంపన్నం చేసినవారే పూజ్య జనార్దనస్వామి. ఈ ప్రత్యేక సంచికలో ఆయన గురించి ఒక పరిచయం. మహారాష్ట్ర, సింధుదుర్గ్‌ జిల్లా కమఠీ గ్రామంలో జనార్దన (1893-1978) గోడ్‌సే కుటుంబంలో జన్మించారు. ఆ నిరుపేద…

Read more »

యోగానంద గురుపీఠం!

By |

యోగానంద గురుపీఠం!

మానవ జీవన గమనానికి ఆనందమే అంతిమ గమ్యం. కష్టాలు ఎలా కొని తెచ్చుకోవాలి! దుఃఖం అనుభవించేదెలా? అని ఆలోచించి తగిన కార్యాచరణ సాగించే మానవుడెవడూ ఈ భూమ్మీద ఉండడు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ ఆనందం కోసమే తపిస్తాడు, శ్రమిస్తాడు. ఆనందం పొందడానికి అనుసరించే మార్గాల్లో, అనుభవించే స్థాయిల్లో తేడా ఉండొచ్చు కాని ఆనందం కోసమే అందరూ తపిస్తారన్నది అక్షర సత్యం.పాశ్చాత్యులకు, భారతీయులకు గల పదార్ధ, పరార్ధ దృష్టి భేదము ఆనందం విషయంలో కూడా ప్రతిఫలించింది. పదార్ధముల, వస్తువుల…

Read more »

శరీర తత్వాన్ని సరిచేసే ‘ముద్రలు’

By |

శరీర తత్వాన్ని సరిచేసే ‘ముద్రలు’

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామం, క్రియలు, ధ్యానంతో పాటు ముద్రలు కూడా ముఖ్యమైనవి. ఈ బ్రహ్మాండం అంతా పంచతత్వాలతో నిర్మితమైనది. ఈ బ్రహ్మాండంలో సృష్టి జరిగిన ఈ శరీరం కూడా సహజంగానే పంచతత్వాల కలయికతో ఏర్పడినది. పంచతత్వాలు అంటే పృథ్వీ (భూమి), జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శరీరంలో ఎప్పుడైతే ఈ తత్వాల సంతులనం దెబ్బతింటుందో అప్పుడు మనిషి వ్యాధిగ్రస్తు డవుతాడు. అప్పుడు పంచతత్వాలను సంతులనం చేయగలిగితే వ్యాధి నెమ్మదిగా తగ్గి, ఆరోగ్యాన్ని పొందవచ్చు. అందుకోసం ఉపయోగపడేవి ముద్రలు….

Read more »