Author Archive

ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం

By |

ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం

– పార్లమెంట్‌ సమావేశాలను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్న విపక్షాలు – చెన్నైలో ఒకరోజు నిరాహార దీక్షతో మోదీ నిరసన – పెరిగిన కాంగ్రెస్‌ విభజన రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రతిపక్షాలు మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మొత్తానికి మొత్తం జరగకుండా శాయశక్తులా ప్రయత్నించాయి. బడ్జెట్‌పై జరగాల్సిన చర్చను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలుగా మార్చుతూ పార్లమెంట్‌ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయి. కావేరీ నదీ బోర్డును ఏర్పాటు…

Read more »

చైనా- నక్క జిత్తులతో ప్రపంచాధిపత్యమా !

By |

చైనా- నక్క జిత్తులతో ప్రపంచాధిపత్యమా !

ఆర్కిటిక్‌ ప్రాంతంలో పర్యావరాణాన్ని పరిరక్షించడం, ఆర్కిటిక్‌ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, ఐక్యరాజ్యసమితి గుర్తించిన స్థానిక జాతుల సంస్కతులను పరిరక్షించడం వంటి విధానాలకు తాము కట్టుబడి ఉన్నామని చైనా ఇప్పటికీ ప్రకటిస్తోంది. కానీ వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ సమయంలో ఇవే మాటలు చెప్పిన చైనా ఆ తరువాత వాటన్నిటిని మరచిపోయింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 10న ఆసియా దావోస్‌గా పిలిచే వార్షిక బోయో సమావేశాలను చైనా అధ్యక్షుడు జి జిన్‌ పింగ్‌…

Read more »

అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌తో ముఖాముఖి

By |

అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌తో ముఖాముఖి

బెల్జియంకు చెందిన కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ ప్రాచీన హిందూ సంస్కృతి, భారతీయతలను ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు. వివిధ మతాల తులనాత్మక పరిశీలన, అధ్యయనం చేసే కోన్రాడ్‌ హిందూ-ముస్లిం సంబంధాలు, భారతీయ చరిత్రను కూడా పరిశీలించారు. లెవియన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయం నుంచి దర్శనశాస్త్రాలు, చైనా, భారత్‌, ఇరాన్‌ల గురించి అధ్యయనం చేసి పిహెచ్‌డి పట్టా పుచ్చుకున్నారు. స్వయంగా రోమన్‌ కాథలిక్‌ అయిన 58 ఏళ్ళ కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ కాథలిక్‌ మతాన్ని తిరస్కరిస్తారు. తననుతాను ‘మతం లేని మానవతావాది’గా చెప్పుకుంటారు. హిందుత్వాన్ని…

Read more »

చూడండి.. సమరసత అంటే ఇదే.. ఆచరించండి..

By |

గిరిజన మహిళకు చెప్పులు తొడుక్కోవడంలో సహకరిస్తున్న ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 14, అంబేద్కర్‌ జయంతి నాడు జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, తెండూ ఆకులను ఏరుకునే గిరిజన మహిళలకు పాదరక్షలు అందజేశారు. ఈ సభలో పాల్గొన్న ఓ గిరిజన మహిళకు పాదరక్షలు బహూకరించిన సందర్భంలో వేదికపైనే ఉన్న ప్రధాని స్వయంగా తానే ముందుకు వంగి ఆమె కాళ్లకు వాటిని ధరింపచేశారు. ఇది చూసిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎస్‌.సి….

Read more »

మతిమాలిన విభజన రాజకీయాలు

By |

మతిమాలిన విభజన రాజకీయాలు

ఈశాన్య భారతంలో, ప్రత్యేకించి చిన్న రాష్ట్రమైన త్రిపురలో భారతీయ జనతాపార్టీ సాధించిన సైద్ధాంతిక విజయం వామపక్షాలను, కాంగ్రెసును మాత్రమే కాక దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను కూడా తీవ్రమైన కలవరానికి గురిచేసింది. బిజెపి బాగా విస్తరించి యావద్భారత స్థాయి గల పార్టీగా అందరి మనసుల్లోనూ స్థిరపడిపోతుందేమో నని వారి బెంగ. బిజెపి తన జాతీయవాదపు కార్యప్రణాళికతో నిదానంగా, నిలకడగా బలపడుతూండడం ప్రాంతీయ పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గడచిన నాలుగేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రాంతీయ పార్టీల…

Read more »

బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ

By |

బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ

కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ ఆవిర్భవించిన ‘తెలంగాణ జన పార్టీ’ కి ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టి జెఏసి ఛైర్మన్‌ కోదండరాం ఇటీవల ‘తెలంగాణ జన సమితి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే కోదండరాం నూతన పార్టీకి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో భారీ…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

కర్ణాటక జెడి (ఎస్‌) ఆపసోపాలు వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో గత వైభవాన్ని పొందాలని కలలు కంటున్న జనతాదళ్‌(ఎస్‌)కు ఆపసోపాలు తప్పడంలేదు. ఒకప్పుడు కింగ్‌గా, కింగ్‌ మేకర్‌గా చక్రం తిప్పిన ఆ పార్టీ నేడు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలను సమర్థవంతంగా ఎదుర్కోలేక నానా తంటాలు పడుతోంది. తండ్రీ కొడుకులైన దేవెగౌడ, కుమారస్వామి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ ప్రాబల్యం కేవలం పాత మైసూరు ప్రాంతానికే పరిమితమయ్యే అవకాశా లున్నట్లు పరిశీలకులు…

Read more »

కాశ్మీరీ మీడియా ఎందుకు వ్యతిరేకిస్తోంది?

By |

కాశ్మీరీ మీడియా ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఇటీవలి కాలంలో కాశ్మీరీ మీడియా (పత్రికలు, ఛానెల్స్‌, సోషల్‌ మీడియా) ను చూస్తున్నవారికి ‘వీరు ఢిల్లీలో తిష్ట వేసిన కుత్సిత పాత్రికేయ వర్గాల బంట్లుగా, ఏదో ఒక పథకం ప్రకారం వ్యవహరిం చటం లేదు గదా !’ అన్న అనుమానం రాక మానదు. జమ్ము ప్రజానీకాన్ని మతతత్త్వ వాదులుగా, తెగేదాకా లాగేవారుగానూ; అదే సమయంలో కాశ్మీరీలను సెక్యులర్‌ దృక్పథం కల్గిన సహనశీలురుగా ప్రచారం లోకి తెస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి తరచుగా ట్వీట్లు చేస్తూ…

Read more »

కాశీపట్నం చూడర బాబు – 19

By |

కాశీపట్నం చూడర బాబు – 19

ధార్మిక, సమాజిక నవల జరిగిన కథ నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు; తల్లి అస్తికలను కాశీలో కలపడానికి శంఖరూప, తన మనుమళ్ళతో బామ్మగారు, చంద్రశేఖర దీక్షితులు రైలులో కాశీ వెళుతున్నారు. వీరితోపాటు ఒక యువబృందం కూడా కాశీ వెళుతున్నారు. అదే రైలులో యోగిగా…

Read more »

మనలాంటి మనిషి

By |

మనలాంటి మనిషి

బాపట్ల అరవై నాలుగు కిలోమీటర్లని రాసి ఉన్న మైలు రాయిని దాటింది గోపి కారు. ¬రున కురుస్తున్న వానలో డ్రైవర్‌కి రోడ్డు సరిగ్గా కనిపించక లిమిటెడ్‌ స్పీడ్‌లోనే వెళుతున్నాడు. గోపి బ్యాక్‌ సీట్‌లో కూర్చుని ‘షెర్‌లాక్‌ ¬వ్స్‌’ రాసిన నవల చదువుతు న్నాడు. ‘ఇంకా ఎంత టైం పడుతుంది రాజు’ చదవడం ఆపి అడిగాడు గోపి. ‘ఇంకో గంటన్నరలో చేరుకుంటాం సార్‌’ బదులిచ్చాడు డ్రైవర్‌. గోపి టైం చూసుకున్నాడు. అప్పటికే తొమ్మిదిన్నర కావస్తోంది. ‘ఛ.. డైరెక్ట్‌గా వచ్చేసి…

Read more »