శ్రీనగర్‌లో అమిత్‌షా వ్యూహాత్మక అడుగులు

శ్రీనగర్‌లో అమిత్‌షా వ్యూహాత్మక అడుగులు

మానవ దేహారోగ్యాన్ని తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు చికాకు పంచినట్లే తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలు దేశ ప్రగతిని కుంటుపరుస్తాయి. చిట్కా వైద్యంతో దీర్ఘ వ్యాధులను నివారించాలని చూసినప్పుడు దేహంలో కీడు సంభవించినట్లే దీర్ఘకాల సమస్యలను అడ్డదారుల్లో పరిష్కరించాలని ప్రయత్నించినప్పుడు దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. హైదరాబాద్‌ తదితర సంస్థానాల విలీనం విషయంలో నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వ్యాధి మూలాలకు చికిత్స చేసినట్లు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి నేరుగా సంస్ధానాధిపతులను ఒప్పించి నిర్వివాద విలీనం సాధించారు. జమ్ము కశ్మీర్‌ సంస్థాన విలీనం విషయంలో వేలు పెట్టిన నాటి ప్రధాని నెహ్రూ సంస్థానాధిపతి రాజా హరిసిరగ్‌తో పాటు షేక్‌ అబ్దుల్లాకు కూడా పాత్ర కల్పించి చిట్కా వైద్యానికి పాల్పడ్డారు. ఫలితంగా భారత రాజ్యారగంలో తాత్కాలికం పేరిట చోటు చేసుకున్న 370వ అధికరణం ఏడుదశాబ్దాల పిదప కూడా రద్దు కాకపోగా ఏకు మేకై కూర్చుని కశ్మీర్‌ను రావణ కాష్టరలా మండిస్తోరది. ఏటేటా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కశ్మీర్లో కుమ్మరించి కూడా కశ్మీరీలలో భారత సమైక్యత సమగ్రతల పట్ల నిబద్ధత నెలకొల్పడం సాధ్యం కావడంలేదు.

పిల్లి గుడ్డిదైతే ఎలుక మీసం మెలేసిన రీతిగా భారత పాలకుల మెతక వైఖరి పసిగట్టిన పాక్‌ కశ్మీర్‌లో కుట్రలకు తెరతీసింది. స్వార్థ రాజకీయ శక్తుల ఆసరాతో వేర్పాటు వాదానికి ఊపిరులూదింది. మతం పేరిట కశ్మీర్‌ యువత మనసు కలుషితం చేసింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ నడిపిన బుజ్జగింపు రాజకీయాల ఫలితంగా భారత సార్వభౌమాధికారాన్ని కశ్మీరీలు సవాలు చేసే దుఃస్థితి దాపురించింది. జాతీయ పతాక రక్షకులుగా వ్యవహరించాల్సిన కశ్మీరీ యువత శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసే దశకు దిగజారడం చరిత్ర. యువతలో వేర్పాటువాద విషబీజాలు నాటిన పాక్‌ కశ్మీర్‌ యువతను దేశద్రోహ కార్యకలాపాలకు పురికొల్పింది. ఫలితంగా నేడు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు, అక్రమ చొరబాటుదార్లకు కశ్మీర్‌ లోయలో స్వాగత సత్కారాలు లభిస్తురడగా దేశభద్రతకు నడుం బిగించిన భద్రతా దళాలు, సిబ్బరదిపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. సాధారణ పద్ధతుల ద్వారా పరిస్థితులను చక్కదిద్దడానికి మెహబూబా ముఫ్తీతో జట్టుకట్టి ప్రభుత్వం ఏర్పరచి బిజెపి సాగిరచిన యత్నాలు సైతం ఫలిరచలేదు. పరిస్థితులు మరిరత విషమిరచకురడా నివారిరచడానికి ప్రభుత్వర నురడి బిజెపి వైదొలగిన ఫలితంగా మెహబూబా ప్రభుత్వర కూలడం, రాష్ట్రపతి పాలన విధిరచడం చకచకా జరిగిన పరిణామాలు. ఈ నేపథ్యరలో భారత హోంమంత్రి అమిత్‌షా జూన్‌ నెలాఖరులో జరిపిన శ్రీనగర్‌ పర్యటన ప్రాధాన్యం సంతరిరచుకుంది. ఆర్టికల్‌ 370 పట్ల బిజెపి వైఖరి, బిజెపి అధ్యక్షుడు కూడా అయిన హోంమంత్రి షా తన పర్యటనలో వేసిన వ్యూహాత్మక అడుగులు భారత ప్రజానీకంలో నూతన ఆశలు రేకెత్తిస్తున్నాయి. భారత రాజ్యారగంలో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణం తాత్కాలికమైనది, రద్దు కాదగినది అని అమిత్‌షా జమ్మూ కశ్మీర్‌ గడ్డమీదే ప్రకటిరచారు. హోంమంత్రి శ్రీనగర్‌ పర్యటన ఎజెరడాలో వేర్పాటువాద నేతలను కలవడం, చర్చలు వంటివి లేనేలేవు. కనుక ఆయన వారిని కలవ లేదు, కనీసం ఫోన్‌లో కూడా వారితో మాట్లాడలేదు. వారు ప్రయత్నిరచినా అనుమతిరచలేదు. మత పునాదులపై వేర్పాటు ఉద్యమాలు నడిపిస్తున్న ముస్లిర నేతలను కలవని హోంమంత్రి అర్షద్‌ ఖాన్‌ అనే కశ్మీరీ ముస్లిర ఇరటికి వెళ్లారు. జూన్‌ 12న పుల్వామాలో జరిగిన బారబుదాడిలో మరణిరచిన వారిలో సిఆర్‌పియఫ్‌ జవాను అర్షద్‌ ఖాన్‌ ఒకరు. ఇరటికి వెళ్లి మరీ ఆయన కుటురబాన్ని పరామర్శిరచిన మంత్రి అర్షద్‌ కుటురబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటిరచి, సంబంధిత నియామక ఉత్తర్వులను వారికి అరదజేశారు. బిజెపితో సహా రాజకీయ నేతలెవరినీ కలవని ¬రమంత్రి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నెగ్గిన 40 వేలమంది సర్పరచులు, వార్డు మెరబర్లను కలిశారు. తద్వారా ప్రజా జీవితంలో పునాది స్థాయి వాస్తవాలను సేకరిరచి, ప్రభుత్వ దృక్పథాన్ని సాధారణ ప్రజలకు చేర్చేరదుకు ప్రయత్నిరచారు. వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరిరచే మోదీ ప్రభుత్వం మతాలకు అతీతంగా జాతీయ వాదులకు అరడగా నిలుస్తురదనే విశ్వాసం కలిగిరచారు. షా వ్యూహం ఫలిరచి కశ్మీర్‌లో వేర్పాటు వాదం అడుగంటి జాతీయవాదం బలోపేతం కాగలదని ఆశిద్దార!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *