అందరిని అక్కున చేర్చుకుందాం : శ్యామ్‌కుమార్‌

అందరిని అక్కున చేర్చుకుందాం : శ్యామ్‌కుమార్‌

పాలమూరు : వసుధైక కుటుంబకం భావనతో అందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవనం సాగించాలని, ఏ ఒక్కరికి దుఃఖం కలుగకూడదని ఒక్క హిందూ ధర్మం మాత్రమే కోరుకుంటున్నదని ఆర్‌.ఎస్‌.ఎస్‌. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలె శ్యామ్‌కుమార్‌ అన్నారు. మహబూబ్‌ నగర్‌, బండమరిపల్లెలోని సాందీపని ఆవాసంలో 2019 ఏప్రిల్‌ 19, 20 తేదీలలో సేవాభారతి- తెలంగాణ ప్రాంత పూర్తి సమయ కార్యకర్తల సమావేశం జరిగింది.సమావేశాలను ప్రారంభిస్తూ శ్యామ్‌కుమార్‌, ‘సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయడం ద్వారా భారతదేశాన్ని పరమవైభవి స్థితికి తీసుకురాగలమని భావించి 94 సంవత్సరాల క్రితం డాక్టర్‌ కేశవరావ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను కొందరు సామాన్య వ్యక్తులతో ప్రారంభించారని గుర్తుచేశారు. 70 సంవత్సరాల స్వాతంత్య్రంలో 30శాతం మంది ప్రజలు ఇంకా పేదరికంలోనే జీవిస్తున్నారని, దు:ఖితులు, పీడితులు, బాధితులను సమాజం దూరంగా పెట్టిందని, వారినందరి దగ్గరకు మనం వెళ్లి, మన సేవాకార్యక్రమాల ద్వారా దగ్గరకు తీసుకోవాలని, వారందరినీ తిరిగి సమాజంలో కలుపుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశాలకు రాష్ట్రంలోని వివిధ ఆవాసాల లోని ప్రముఖులు, పాఠశాలల ప్రధానా చార్యులు, ఇతర ప్రకల్పాలలోని పూర్తి సమయం కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమాలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌, తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్‌ వాసు, సేవాభారతి గౌరవాధ్యక్షులు డాక్టర్‌ గౌడ జనార్దన్‌, అధ్యక్షులు దుందుపు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రబాల రామ్మూర్తి, సహ కార్యదర్శులు సి.వి. సుబ్రహ్మణ్యం, జయప్రదా దేవి, సభ్యులు పొట్లారి చారేంద్ర తదితరులు పాల్గొని, మార్గదర్శనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *