అలుపెరగని ఆ దేశ సేవకుడు ఇక లేరు

అలుపెరగని ఆ దేశ సేవకుడు ఇక లేరు

రాజమండ్రి: ‘రాజేంద్ర’ పేరుతో అత్యవసర పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలోను, తరువాత దివిసీమ ఉప్పెన తదనంతర సేవలోను పాల్గొని అందరికి చిరపరిచితులైన ఎస్‌.టి.జి. రామచంద్రాచారి (64) జూన్‌ 6న రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందారు. ఉదయం శాఖకు హాజరై రోడ్డు దాటుతూ ఉండగా మోటర్‌ సైకిల్‌ ఢీ కొట్టడంతో తీవ్ర ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రామచంద్రాచారి మచిలీపట్నం ఆంధ్రజాతీయ పాఠశాల, కళాశాలలో విద్యాభాసం చేశారు. 1976లో బి.కామ్‌. చదివి, 4 సంవత్సరాలు ప్రచారక్‌గా పనిచేశారు. తరువాత యం.కామ్‌.లో చేరి ఎ.వి. కాలేజి నుండి బంగారు పతకం అందుకున్నారు.

విశాఖ శ్రీగాయత్రీ జూనియర్‌ కాలేజీలో వివిధ హోదాలో పని చేసి 2018లో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా విద్యార్థి పరిషత్‌కు సుదీర్ఘకాలం పాటు సేవలందిం చారు. వనవాసి కల్యాణ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత కార్యదర్శి బాధ్యతలో చివరి వరకు పనిచేశారు. ఆయన అవయవాలను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి దానం చేశారు. రామచంద్రాచారి మృతికి ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు, ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *