జాతీయగీతం కూడా ఆపేస్తారా!

జాతీయగీతం కూడా ఆపేస్తారా!

రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించిన పదకొండు పేజీల వినతిపత్రంలో కర్నె శ్రీశైలం ప్రధానంగా స్వేరోస్‌ ఆగడాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆశ్రమ విద్యాల యాల సొసైటీలో, తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యాలయాలలో పాలు, కూరగాయలు, పరిశుభ్రత, ఔట్‌సోర్సింగ్‌, నియామకాలు, సివిల్‌ పనులు, టెండర్లు అన్నీ కూడా బినామీ పేర్లతో జరుగుతున్నాయని శ్రీశైలం ఆరోపించారు. అదే స్వేరోస్‌. దీని వెనుక సాంఘిక సంక్షేమ ఆశ్రమ విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హస్తం ఉందని శ్రీశైలం వినతిపత్రంలో పేర్కొన్నారు. స్వేరోస్‌ ప్రధాన కార్యదర్శి దామోదర రావుపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో 1.5.2018న కేసు నమోదైంది. ఇది తొమ్మిదో తరగతి చదువుతున్న షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థిని మీద అత్యాచారం కేసు. స్వయంగా ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. కానీ ఈ ఫిర్యాదు మీద సరైన దర్యాప్తు జరగలేదు. అలాగే 4.4.2018న ఆదిలా బాద్‌ టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో స్వేరోస్‌లో మరొక ప్రముఖుడు కె. రవికుమార్‌ మీద కేసు నమోదైంది. ఇతడు షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ఒక మైనర్‌ బాలికను అపహరించి రెండు రోజులు తన అధీనంలో ఉంచుకున్న కేసు ఇది. ఈ కేసు కూడా ఆ బాలిక తండ్రి ఇచ్చినదే. అయినా ఇతడికి ప్రవీణ్‌ కుమార్‌ పలుకుబడితో స్టేషన్‌లోనే బెయిల్‌ ఇచ్చారు. హిందూ దేవతలను, హిందువులను కించపరుస్తూ మాట్లాడినట్టు ఆరోపణలు రావడంతో రామాయం పేట పోలీస్‌ స్టేషన్‌లో సంజీవ్‌ దుబాష్‌ (స్వేరోస్‌ మెదక్‌జిల్లా శాఖ అధ్యక్షుడు) మీదకూడా కేసు నమోదైంది. ఇది 18.5.2018న నమోదు చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు.

స్వర్గీయ ఆర్‌ఎస్‌ శంకరన్‌ పేరుతో కూడా ఒక సంస్థను స్థాపించి ప్రవీణ్‌కుమార్‌ అధికార దుర్విని యోగం చేస్తున్నారు. ఈ సంస్థను రాజేశ్‌ అనే తన సన్నిహితుడి చేతిలో ఉంచారు. రాజేశ్‌ అంటే ప్రవీణ్‌ కుమార్‌ బినామీ అని కర్నె శ్రీశైలం ఆరోపణ. ఆశ్రమ పాఠశాలలకు అవసరమైన పాలు, కూరగా యలు, పరిశుభ్రత పని వంటివన్నీ కూడా శంకరన్‌ సంస్థ ద్వారానే అందిస్తున్నారు. ఈ అంశంలో మొత్తం నిబంధనలన్నీ తుంగలో తొక్కుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం తీసుకువస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ బావమరిది కేశవ్‌కు కూడా ఔట్‌ సోర్సింగ్‌ పనులలో ప్రమేయం కల్పించారు. మూడు వందల కోట్ల రూపాయల పనులు కేవలం నామి నేషన్‌ విధానం ద్వారా ఈ కేశవ్‌కే ప్రవీణ్‌కుమార్‌ అప్పగించా రని కూడా శ్రీశైలం వినతిపత్రంలో పేర్కొన్నారు.

స్వేరోస్‌ సభ్యులు వివిధ పాఠశాలలు, వసతిగృ హాలలోకి ప్రవేశించి అవకతవకల తనిఖీల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవరిస్తూ, ఉద్యోగులను బెదిరిస్తు న్నారు. ఎవరు దీనిని ప్రశ్నించినా, ఎదురుతిరిగినా వారు చెప్పే పేరు ఒక్కటే- ప్రవీణ్‌కుమార్‌. తమ దారిలోకి రాని ప్రిన్సిపాల్స్‌ మీద, ఇతర ఉద్యోగుల మీద నకిలీ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అక్రమ దారుల్లో డబ్బులు చెల్లించాలని కూడా బలవంతం చేస్తున్నారు. ఉదయం ప్రార్థన జరిగే వేళ అక్ర మంగా అక్కడికి ప్రవేశించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అసాంఘిక, జాతి వ్యతిరేక బోధనలే.

ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న ఈ అక్రమ చర్యలకు బాధ్యులు ప్రవీణ్‌కుమార్‌ అని కూడా శ్రీశైలం ఆరోపించారు. అవి- స్వేరోస్‌ ద్వారా ఉపాధ్యాయుల మీద నిఘా. దసరా, బతకమ్మ, దీపావళి, సమ్మక్క-సారమ్మ ఉత్సవాల మీద వ్యతిరేక ప్రచారం. క్రిస్మస్‌ నిర్వహణనే ప్రోత్సహించడం. నమస్తే అని కాకుండా ‘జైభీమ్‌’ అని చెప్పాలని ఒత్తిడి తేవడం. ఎస్‌టి గురుకులాలలోని లంబాడీ ఆరాధ్యం దైవం సంత్‌ సేవాలాల్‌ ఫోటోలు తొలగించడం. స్వేరోస్‌ డైరీలు పంచడం, అందులో బీమా కొరేగావ్‌ సంఘటనను ఆకాశానికి ఎత్తడం. పూనాలో జరిగే ఆ ఉత్సవానికి యువకులను పెద్ద సంఖ్యలో పంపించడం. గాంధీ ఫొటోను తొలగించడం, గాంధీ జయంతిని నిర్వహించవద్దని ఆదేశించడం. జాతీయ నాయకులందరి ఫొటోలు తొలగించడం. జాతీయ గీతానికి బదులు స్వేరోస్‌ గీతం ఆలపించమని ఆదేశించడం. నేను స్వేరోను అని అనిపించడం.

ఈ అంశాల మీద దర్యాప్తు అవసరమని శ్రీశైలం తన వినతిపత్రంలో కోరారు. తను సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రం గురించి, ఆ వివరాల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా స్వేరోస్‌ సభ్యులు ఎందుకు దాడి చేయవలసి వచ్చింది. ఇదే ఇప్పుడు అంతా అడుగుతున్న ప్రశ్న. అలాగే ప్రవీణ్‌కుమార్‌ సక్రమంగానే పని చేస్తున్నారని పేరెంట్స్‌ చేత ఎందుకు చెప్పించవలసి వచ్చింది? ఎస్‌సి వర్గం బాలికల మీద ఈ రీతిలో అత్యాచారం జరిగినా హక్కుల కార్యకర్తలు, టీవీ చానెల్‌ సింహాలు ఎందుకు నోరెత్తడం లేదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *