జనజాగృతి

జనజాగృతి

అన్ని రాష్ట్రాల్లో ఎన్నార్సీ నిర్వహించాలి

మనదేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాల విషయంలో మానవతా దక్పథంలో వ్యవహరించాలని, వారికి రక్షణ, నివాస, ఉపాధి అవకాశాలు కల్పించాలని కొంతమంది లౌకికవాదులు చిలక పలుకులు పలుకుతున్నారు. వారికి పౌరసత్వం ఇవ్వాలనే వాదన కూడా మొదలుపెట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు.

నేడు భారత్‌తో సహ ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం పెద్ద సవాలుగా మారింది. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారంతా చొరబాటుదార్ల ముసుగులో దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అసోం, పశ్చిమ బెంగాల్‌, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను చొరబాటు ఓటర్లు ప్రభావితం చేస్తున్నారు.

ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే మనదేశ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఈ కుట్రను భారతీయులంతా కలిసికట్టుగా, సమర్థవంతంగా తిప్పికొట్టాలి. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చొరబాటుదార్లను గుర్తించి తిప్పి పంపేందుకు అసోం తరహాలో ఎన్నార్సీ నిర్వహించాలి.

– భరత్‌ చౌహన్‌, నిజాం కళాశాల, హైదరాబాద్‌

అహంకారం పనికిరాదు

సుపరిపాలన గురించి నాకు చెప్తారా?! నన్నే అవినీతి పరుడంటారా?! 40 ఏళ్ల అనుభవం ఉన్న నాకే పరిణతి లేదంటారా? నా అంత అనుభవం లేని మోదీకే పరిణతి లేదు. సర్వ సమర్థుడనే ప్రజలు నన్ను గెలిపించారు. ఐదు నగరాల రాజధాని ప్రపంచంలోనే లేదు. నేను నిర్మిస్తున్నాను.. ఇవి వివిధ సందర్భాలలో చంద్రబాబు నోట వెలువడిన సుభాషితాలు. ఈ మాటలు విన్నవారికి ఇతగాడికి అహంకారం, అతిశయం ఎక్కువే అనిపిస్తుంది. కార్యసాధకుడెప్పుడూ ఇలా నోరుపారేసుకోడు. ఈయన మిత్రలాభం, సంధి అనే మెట్లు వదిలేసి మిత్రభేదం, నిగ్రహం అనే మెట్లనే ఎంచుకోవడం వల్ల కార్యసాధన కుదరదని గ్రహించలేదు.

– శాండీ, కాకినాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *