రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

మహారాష్ట్ర

దేశాన్నే జైలుగా మార్చారు

ఇందిరా గాంధీ హయాంలో దేశంలో విధించిన అత్యయిక పరిస్థితి గురించి నేటి తరానికి తెలియజేసేందుకే నిరసన దినం పాటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశం అత్యయిక స్థితి చవిచూసి 43 ఏళ్లయిన సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రు-గాంధీ కుటుంబంపై సునిశిత విమర్శలు చేశారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పదే పదే చెప్పేవారి కుటుంబమే దేశాన్ని జైలుగా మార్చిందని దుయ్యబట్టారు. అధికారం తమ చేతుల్లో నుంచి జారిపోతున్న ప్రతిసారీ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో భయాన్ని వెదజల్లే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేవలం వాళ్లు మాత్రమే అధికారంలో కొనసాగాలని కాంగ్రెస్‌ పార్టీవారు కోరుకుంటారని మోదీ విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌ ఎన్నికల సంఘంపై నెపం మోపే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం వల్లే వారు ఓడిపోయారు.. కానీ వాళ్లు ఏ స్కామ్‌లకూ పాల్పడలేదు.. ఏ కేసులూ వారిపై లేవు.. బెయిళ్ల కోసం కాంగ్రెస్‌ నేతలు కోర్టుల చుట్టూ తిరిగిన దాఖలాలే లేవంటూ ప్రధాని ఎద్దేవా చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని లబ్ధ ప్రతిష్ఠులైన రాజకీయ నాయకులందరినీ జైళ్లకు నెట్టారని, ఒక విధమైన భయాన్ని నాడు దేశంలో కలుగజేశారని అన్నారు. ఇదంతా ఓ కుటుంబ శ్రేయస్సు కోసం జరిగిందని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. అలాంటి వారికి ఈ ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఏం ఉంటుంది? అని మోది ప్రశ్నించారు.

ఒడిశా

పాముల పుట్ట

ఒకే ఇంట్లో 132 నాగుపాములు, వాటిపిల్లలు. ఈ వార్త వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ పాముల పుట్ట ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. భద్రక్‌ జిల్లా ధామ్‌నగర్‌ సమితి పయికొసాహీ గ్రామంలో భిజయ్‌ భుయ్యా ఇంట్లో ఈ పాములను స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ ప్రతినిధులు పట్టుకున్నారు. ఐదారేళ్ళుగా ఇంట్లో నాగుపాము కనిపిస్తోందని, దాన్ని పూజిస్తున్నామని భుయ్యా చెబుతున్నారు. జూన్‌ 21వ తేదీ రాత్రి ఇంట్లో చిన్నారులకు రెండు పాములు కనిపించగా వాటిని తండ్రికి చూపించారు. అవి ఇంట్లోని ఓ రంధ్రంలో దూరడంతో భుయ్యా అందులో పినాయిల్‌ పోశాడు. దీంతో నాలుగైదు పాముపిల్లలు బయటకు వచ్చాయి. భయపడిన కుటుంబీకులు రాత్రి పక్కింట్లో పడుకున్నారు. ఉదయం స్నేక్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధి షేక్‌ మీర్జాకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చారు. మట్టి ఇల్లు కావడంతో పలుచోట్ల పడిన రంధ్రాలను పరిశీలించగా మరిన్ని నాగుపాము పిల్లలు, గుడ్లు కనిపించాయి. పాములు పట్టే వారిని రప్పించి తవ్వి తీస్తుంటే గుట్టలు గుట్టలుగా రాసాగాయి. 23వ తేదీ రాత్రికి 120 పాములు, పాము పిల్లలు, 25 గుడ్లు కనిపించాయి. 24వ తేదీ ఉదయానికి మొత్తం 132 పాములు బయటపడ్డాయి. ఈ సంఘటనపై అటవీ సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. పాములను చూసేందుకు భుయ్యా ఇంటి వద్ద స్థానికులు బారులుదీరారు.

ఆంధ్రప్రదేశ్‌

కేసు దర్యాప్తు ముమ్మరం

చికాగో కేంద్రంగా కిషన్‌ దంపతులు సాగించిన వ్యభిచార వ్యహారం ఇప్పుడు అమెరికాలోని తెలుగు సంఘాల మెడకు చుట్టుకుంది. కొద్దిరోజులుగా ఎఫ్‌.బి.ఐ. ఏజెంట్లు ఆ సంఘాల ప్రతినిధులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. ఏటా నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యకలాపాలకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటులను రప్పించడం మామూలే. తాజా ఉదంతం నేపథ్యంలో అమెరికా పోలీసులు భూతద్దంతో చూస్తోండటం పలువురిని కలవరపాటుకు గురిచేస్తోంది.

తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. చేతికి దొరికిన చిత్తు కాగితంతో చరిత్ర మొత్తం తవ్వి తీస్తున్న అమెరికా పోలీసులు ఇప్పుడు దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఇదేదో మోదుగుమూడి కిషన్‌ దంపతుల వ్యవహారంగానే భావించినప్పటికీ ఆరుగురు సినీనటులు, ఇంకా అనేక మంది విటులకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చిన విషయం విదితమే. రకరకాల సాంస్కృతిక సంస్థల పేర్లతో మహిళలను అమెరికా రప్పించి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని అమెరికా పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.

దీన్ని నిగ్గు తేల్చే ఉద్దేశంతోనే ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) అధికారులు ఇప్పుడు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మనదేశంలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాల నుంచి తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. సాంస్కృతిక కార్యక్రమాల వరకే తమకు తెలుసని వివిధ సంఘాల వారు చెబుతుండగా కొందరు నటీమణుల ఖాతాల్లో పెద్దమొత్తంలో డాలర్లు జమైనట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

పశ్చిమబెంగాల్‌

‘ఒకే దేశం – ఒకే సంస్కృతి’

కాంగ్రెస్‌ నుండి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నాగపూర్‌లో జరిగిన సంఘ తృతీయవర్ష ముగింపు కార్యక్రమంలో ప్రణబ్‌ముఖర్జీ పాల్గొనడం పట్ల ఆర్‌.ఎస్‌.ఎస్‌. ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఉత్తరం రాసింది.

‘ఒకే దేశం – ఒకే సంస్కృతి’ అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ప్రణబ్‌ముఖర్జీని ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహసర్‌కార్యవాహ మన్‌మోహన్‌వైద్య ప్రశంసిస్తూ ఈ మేరకు జూన్‌ 25న ప్రణబ్‌కు ఉత్తరం రాశారు.

ఉత్తరం పంపే ముందు వైద్య బెంగాల్‌ స్వయంసేవకులతో మాట్లాడుతూ ప్రణబ్‌ముఖర్జీ సంఘ కార్యక్రమంలో పాల్గొనడాన్ని కొంతమంది వ్యతిరేకించడం ప్రారంభించిన తర్వాత దానిని దేశం నలుమూలల ఎలక్ట్రానిక్‌ మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే కాకుండా ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ కూడా ప్రణబ్‌ ఈ కార్యక్రమానికి హాజరు కావడాన్ని వ్యతిరేకించారని, ప్రణబ్‌ మాట్లాడింది మరిచిపోయి ఆయన పాల్గొన్న ఫోటోలను, మాట్లాడని విషయాలను ప్రచారం చేస్తారని శర్మిష్ఠ ఆరోపించా రని వైద్య గుర్తు చేశారు. అయితే తర్వాత ఆమె ఈ ఉత్తరం గురించి స్పందించడానికి నిరాకరించారు.

‘ప్రణబ్‌బాబు’ అని సంబోధిస్తూ రాసిన ఈ ఉత్తరంలో వారి నిరాడంబరత అందరిని ఆకర్షించిం దని వైద్య అన్నారు. నాగపూర్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యక్రమానికి ప్రణబ్‌ రాకతో జీశీఱఅ ఱఅ =ూూ ద్వారా సంఘంలో చేరేవారి సంఖ్య మరింత పెరిగిందన్నారు.

ప్రణబ్‌ నాగపూర్‌ కార్యక్రమానికి హాజరుకాక ముందు సంఘ వెబ్‌సైట్‌ ద్వారా రోజుకి సరాసరి 378 అప్లికేషన్స్‌ వచ్చేవని, జూన్‌ 7వ తేదీన ఆ సంఖ్య 1,779 (4 రెట్లు)కు పెరిగిందన్నారు. అందులో అత్యధిక సంఖ్య బెంగాల్‌ నుండే ఉందని వైద్య చెప్పారు.

కేరళ

నేరస్థులకు జీవిత ఖైదు

మార్చి 8వ తేదీ, 2008 సంవత్సరంలో కేరళలోని తలస్సేరి సమీపంలోని వడక్కుంబాడి వద్ద పరాక్కండి నిఖిల్‌ అనే బిజెపి కార్యకర్తను కొంతమంది సి.పి.ఎం కార్యకర్తలు హత్యచేశారు. ఈ విషయంలో విచారణను కొనసాగించిన తలస్సేరి అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు జూన్‌ 25వ తేదీన ఐదుగురు సిపిఎం కార్యకర్తలకు జీవిత ఖైదు విధించింది. వారిలో 1. శ్రీజిత్‌ (39), 2. వినయ్‌ (31), 3. కె.పి.మనాఫ్‌ (42), 4. పి.పి.సునీల్‌కుమార్‌ (51), 5. సి.కె.మార్సూక్‌ (31) ఉన్నారు. మొత్తం 8 మందిపై కేసు మోపగా సరైన సాక్ష్యాలు లేనందు వలన ఫిరోస్‌ (38), విల్సన్‌ (55)లకు శిక్ష నుండి విముక్తి లభించింది. శశిధరన్‌ అనే వ్యక్తి కేసు విచారణలో ఉండగానే మరణించాడు.

– మూర్తి

 

ఔరంగజేబ్‌ గురించిన చర్చలేవి ?

చరిత్ర గతిని మార్చే సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. వాటి ప్రాధాన్యాన్ని కాల గమనంలో తరువాత ఎప్పుడో గుర్తిస్తుంటాం. ఔరంగజేబు క్రూర మనస్తత్వం మొఘల్‌ సామ్రాజ్య పతనాన్ని శాసించింది. అతని మత మౌఢ్యం అతి ప్రాచీన మ¬న్నత సంస్కతికి ఎనలేని అపకారం చేసింది. ఐనా దురదష్టవశాత్తు వేల సంవత్సరాల బానిస మనస్తత్వానికి వారసులు, ఎర్ర కళ్లతో చరిత్ర చూసే మేధావులు, నకిలీ లౌకికవాదులు అసలు వాస్తవాన్ని కప్పిపుచ్చి అతన్ని వెనకేసుకొచ్చారు. వాళ్ళ దష్టిలో అతనో నిబద్ధత గల వ్యక్తి.

కానీ నయా ఔరంగజేబు (టెర్రరిస్టులతో పోరాడుతూ అమరుడైన మన వీర జవాన్‌)ను మనలో ఎంతమంది ఎంతకాలం గుర్తించుకుంటాం! అసమాన ధైర్యసాహసాలు చూపి, జాతి వ్యతిరేక శక్తులతో పోరాడి, భారతదేశం కోసం అసువులు బాసిన ఈ నయా ఔరంగజేబుని మన సమాజం త్వరలోనే మరచిపోవచ్చు. ఎందుకంటే నకిలీ లౌకికవాదుల దష్టిలో అతను విధి నిర్వహణలో అమరుడైన మరో ఉద్యోగి మాత్రమే.

కానీ ఈ ఔరంగజేబు చుట్టూ ఉన్న సామాజిక ఆర్థిక నేపథ్యం గమనిస్తే దేశం కోసం అతను చేసింది నిరుపమాన త్యాగం, సాహసం. కశ్మీర్‌ సరిహద్దు కావల ఉన్నదంతా పరాయి భారతదేశమని, దానిని ద్వేషించాలని భావించే, ఉద్బోధించే మనుషుల మధ్య పుట్టి పెరిగిన సాటి యువతలా విద్వేషానికి లొంగిపోకుండా జాతీయ భావనతో ఆలోచించి అందుకు అనుగుణంగా సైన్యంలో చేరి అసమాన త్యాగం చేయడం అతికొద్ది మందికే సాధ్యం.

మతాలకతీతంగా దేశం కోసం ఆత్మార్పణ చేసుకున్న మ¬న్నత వ్యక్తిత్వానికి, మతంకోసం జాతి నాశనానికి తెగబడ్డ హీనుడికి మధ్య తేడా, స్థాయిభేదం మరచి, నిజమైన జాతీయ వీరులను గుర్తించే విచక్షణ సమాజంలో వచ్చినపుడే మనం నిజమైన ఆధునికులం. ఆ విచక్షణ రానంతవరకు భౌతికమైన వస్తువులు వాడటంలో మాత్రమే ఆధునికులం. మానసికంగా మధ్యయుగాల నాటి వారమే అవుతాం.

ఈ నయా ఔరంగజేబు త్యాగం వథా పోలేదన్నది జరుగుతున్న పరిణామాలని బట్టి అర్థం అవుతోంది. ఈ నయా ఔరంగజేబు ప్రాణత్యాగం కాశ్మీర్‌ చరిత్ర మార్చబోతోందా? అవుననే అనిపిస్తోంది. అంతటి దేశభక్తి చాటుకున్న ఈ ఔరంగజేబ్‌ గురించి మన ప్రసార మాధ్యమాలలో కూర్చుని దేశం కోసం వాదించే సోకాల్డ్‌ మేధావులు ఏ మాత్రం చర్చించారు ? ఇది అవసరమైన విషయం కాదా ? ఇలాంటి విషయాల గురించి చర్చిస్తేనే కదా ముస్లిం యువతకు సరైన మార్గనిర్దేశం లభించేది ! కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ? ఏ భావజాలం ఎగదోస్తున్నారు ? కాలమే దానికి సమాధానం చెబుతుంది.

– మోహన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *