న్యాయ గంట

న్యాయ గంట

అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు న్నారు. ఆయన దయామయుడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకొనేవాడు. అయితే ఆయన మంచితనం అలుసుగా తీసుకొని అంతఃపురంలో పనిచేసే కొంతమంది లంచాలకు మరిగారు. రాజుగారి వద్దకు బాధ వెళ్ళబోసుకొనేందుకు వచ్చే వారు డబ్బిస్తేనే దర్శనానికి పంపేవారు. వారు అలా చేయడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడేవారు.

కొన్ని రోజుల తరువాత తమ పరివారం ప్రజలను తన దగ్గరకు పంపించడానికి ధనం గుంజుతున్నారని రాజు తెలుసుకున్నాడు. తనను కలవడానికి వచ్చినవారి విషయం తనకు వెంటనే తెలియడానికి కోట గుమ్మానికి ఒక పెద్ద గంట వ్రేలాడ గట్టించాడు. రాజ దర్శనానికి ఎవరు వచ్చినా గంట మ్రోగిస్తే చాలు భటులు వారిని దరాÄ్బరులో ప్రవేశపెడతారు. ఇలా చేయడం వలన కోటలో లంచగొండితనం నశించింది. ప్రజలంతా చాలా సంతోషించారు.

కొన్ని రోజుల తరువాత రాజుగారు దరాÄ్బరులో సభ నిర్వహిస్తుండగా కోట బయట కట్టిన గంట మ్రోగసాగింది. రాజుగారు ఆ వచ్చినవారెవరో వారిని దరాÄ్బరులో ప్రవేశపెట్టమని ఆదేశించారు.

భటులు భయటకు వెళ్ళి చూడగా, ఒక బక్కచిక్కిన గుర్రం గంటకు కట్టిన త్రాడుకు ఉన్న కుచ్చును గడ్డి అనుకొని నమల సాగింది. అలా లాగి నమిలినప్పుడు గంట మ్రోగుతోందనే విషయం గ్రహించి అదే విషయాన్ని రాజుకి విన్నవించారు.

రాజు దర్బారునుండి బయటకు వచ్చి, ఆ ఎండి వరుగులాగున్న గుర్రాన్ని చూడగానే ఆయన మనసు ద్రవించిపోయింది. వెంటనే ఆ గుర్రం యజమాని ఎవరో తెలుసుకొని అతడిని సభలో ప్రవేశపెట్టమని భటులను ఆదేశించారు.

భటులు ఆ గుర్రం యజమానిని వెతికి పట్టుకొని సభలో ప్రవేశపెట్టారు. రాజుగారు అలా గుర్రాన్ని ఆహారం పెట్టకుండా వీధులలో వదలడానికి కారణమేమిటని అతడిన గద్దించి అడిగారు.

అతడు ‘అయ్యా! గుర్రం ముసలిదైపోయింది. దాని వల్ల పిసరంత లాభం లేదు. మేత వెయ్యలేక పోతున్నాను’ అని రాజుగారికి చెప్పుకొన్నాడు.

రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చింది.

‘ఓపిక ఉన్నంతవరకు గుర్రంచేత పని చేయించుకొని, దానికి ఆహారం పెట్టకుండా మాడ్చి చంపటం న్యాయమా ? నీ తల్లితండ్రుల విషయం అలాగే చేస్తావా? అని ప్రశ్నించారు.

వయసులో ఉన్నంతకాలం దాని సేవలు పొంది నిర్దయగా వీధులలో వదిలినందుకు ఆ గుర్రం యజమానికి కఠిన శిక్ష విధించారు. ఇకపై ఎవరు జంతువులపట్ల నిర్దయగా ప్రవర్తించినా, కారాగార శిక్ష విధిస్తామని రాజ్యమంతటా చాటింపు వేయించారు.

– సత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *