లెంపలేసుకున్న ‘టైమ్‌’

లెంపలేసుకున్న ‘టైమ్‌’

మీడియా, మరీ ముఖ్యంగా విదేశీ మీడియా భారత ప్రధాని, బీజేపీ ప్రముఖుడు నరేంద్రమోదీ పట్ల ఎలాంటి పక్షపాత వైఖరి, తొందరపాటు ధోరణి, దుందుడుకు వైఖరి అవలంబిస్తున్నదో మరోసారి రుజువైంది. భారతీయ మీడియాలో ఒక వర్గాన్ని మించి ఆ మీడియా వ్యవహరించడమే దారుణం. న్యూయార్క్‌ కేంద్రంగా వెలువడే ‘టైమ్‌’ వారపత్రికకు అంతర్జాతీయంగా పరువు మర్యాదలు ఉన్నాయి. ఆ పత్రిక కూడా దిగజారుడుగా వ్యవహరించింది. టైమ్‌ వ్యవహారం దిగజారుడుతనమేననడానికి ఆ పత్రికే తనకు తానే రుజువులు ఇచ్చింది.

మోదీ భారత విభజన సారథి (ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌) పేరుతో మే నెల 10వ తేదీ సంచికలో ముఖపత్ర కథనంగా వెలువరించింది. కానీ ఎన్నికల ఫలితాలు రాగానే, భారతీయులు మోదీని ఎంతగా ఆరాధిస్తున్నారో తెలిసిన తరువాత వెంటనే మాట మార్చేసింది. టైమ్‌ వంటి ఎంతో చరిత్ర కలిగిన పత్రిక కూడా ఇలా వ్యవహరించడం అన్యాయం. కాబట్టి విమర్శల నుంచి తప్పించు కోలేకపోతోంది. మొదటి వ్యాసంలో మోదీ ఈ దేశాన్ని కులాలు, మతాల వారీగా విభజించారని ముఖపత్ర కథనం వెలువరించింది. దీనిని పాకిస్తాన్‌ మూలాలు కలిగిన అతీష్‌ తసీర్‌ అనే జర్నలిస్టు రాశారు. అయితే గడచిన ఐదు దశాబ్దాలలో దేశాన్ని ఐక్యం చేయడంలో మోదీ చేసినంత కృషి వేరెవరూ చేయలేదు అన్న శీర్షికతో మరొక ముఖపత్ర కథనాన్ని ప్రచురించింది. దీనిని భారత్‌కు చెందిన మనోజ్‌ లాధ్వా రాశారు.

లాధ్వా లండన్‌ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్‌ కార్పొరేషన్‌ గ్రూప్‌ అనే మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. ఎంత తేడా! ఒక మతానికీ, విశ్వాసానికీ చెందిన ప్రధాని కాబట్టి, ఆయనను తన మాతృదేశం ద్వేషిస్తుంది కాబట్టి ఒక జర్నలిస్టు ఇలాంటి ధోరణితో అభిప్రాయాలు వ్యక్తం చేస్తారా? ఇది జర్నలిజమేనా! ఒక మతం ప్రధానిని ఇంకొక మతానికి చెందిన జర్నలిస్ట్‌ ఇలాగే అంచనా వేయాలా? ఇప్పుడు మోదీ విషయంలో జరుగుతున్నది అది కాదా! పైగా ఈ కొత్త ముఖపత్ర కథానానికి ముందు ఇచ్చిన ముఖపత్ర కథనానికి ఇచ్చినంత ప్రాచుర్యం ఘనత వహించిన మన మీడియా ఇవ్వలేదు. ఇది వింతా! కాదు, ఇస్తేనే వింత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *