ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అగ్రస్థానం

సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పారి శ్రామిక విధానం ప్రోత్సాహక శాఖ ఈ ర్యాంకులను 13 జూలై 2016న ప్రకటించింది. తెలంగాణ 53.7 శాతం స్కోరుతో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్‌ రెండు, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచాయి.

ఏపీలో సముద్ర వైజ్ఞానిక విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో సముద్ర వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. రష్యాలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని ప్రఖ్యాత స్టేట్‌మెరైన్‌ టెక్నికల్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఇది ఏర్పాటవుతుంది. సీఎం చంద్రబాబునాయుడు రష్యా పర్యటనలో భాగంగా 13 జూలై 2016న ఈ విశ్వవిద్యాలయంతో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

డిజిటలైజేషన్‌లో ఏపీకి ప్రథమ స్థానం

డిజిటలైజేషన్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వా నికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ పారదర్శక సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు 15 జూలై 2016న సీఎన్‌బీసీ ఈ అవార్డులను అందించింది. దిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపి ఐటీ కార్యదర్శి సి.ఎస్‌.ప్రద్యుమ్నకు ఈ అవార్డు అందిం చారు. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించింది.

నియామకాలు

డీఆర్‌డీఎల్‌ సంచాలకుడిగా ప్రసాద్‌

రక్షణ పరిశోధన అభి వృద్ధి సంస్థకు చెందిన హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల సంచాల కులుగా శాస్త్రవేత్త ఎం.ఎస్‌. ఆర్‌.ప్రసాద్‌ నియమితు లయ్యారు. క్షిపణుల రూపకల్పనలో కీలకమైన ఈ ప్రయోగశాలకు మొదటిసారి తెలుగువ్యక్తి సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1961లో జన్మించిన ప్రసాద్‌ మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ పూర్తిచేశారు, ఐఐటీ ముంబాయి నుంచి ఎంటెక్‌ పూర్తిచేసి 1984లో డీఆర్‌డిఎల్‌లో చేరారు.

బిపిసిఎల్‌ సిఎండిగా రాజ్‌కుమార్‌

ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌, మేనే జింగ్‌ డైరెక్టర్‌గా డి.రాజ్‌ కుమార్‌ నియమితు లయ్యారు. ప్రస్తుతం రాజ్‌ కుమార్‌ భారత్‌ పెట్రో రిసోర్సెస్‌ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఛైర్మెన్‌ వరదరాజన్‌ 2016 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్‌లో రాజ్‌కుమార్‌ పదవీ బాధ్యతలు చేపడతారు. ఆయిల్‌ ఇండియా కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉత్పల్‌ బోరా నియమితు లయ్యారు. అయిదేళ్ళపాటు వీరు ఈ పదవిలో ఉంటారు.

క్షిపణులు, వ్యూహాత్మక ఆయుధాల డైరెక్టర్‌ జనరల్‌ సతీశ్‌రెడ్డి

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలోని మిస్సైల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. 15 జూలై 2016న సతీశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సతీశ్‌రెడ్డి ప్రస్తుతం రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. దీనికి అదనంగా క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల విభాగానికి నాయకత్వం వహిస్తారు. సతీశ్‌రెడ్డి 1986లో డీఆర్‌డీవో శాస్త్రవేత్తగా చేరారు. ఇనర్షియల్‌ వ్యవస్థలు, నేవిగేషన్‌ వ్యవస్థలు, ఆల్గోరిథమ్స్‌, డిజైన్‌ అభివృద్ధిలో సతీశ్‌ కీలకపాత్ర పోషించారు.

సాంకేతికం

హైకోర్టులో కాగిత రహిత ఈ-కోర్టు

ఆధునిక సాంకేతిక ఆలంబనగా కాగిత రహిత ఈ – కోర్టును 17 జూలై 2016న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ప్రారంభించారు. మొదటిదశలో దాఖలు చేసిన పిటీషన్‌ను ఇతర అనుబంధ పత్రాలను స్కాన్‌చేసి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. మొత్తం ప్రక్రియ కాగిత రహితంగా జరుగుతుంది.

సాహిత్యం

సానియా ఆత్మకథ ‘ఏస్‌ అగైనెస్ట్‌ ఆడ్స్‌’ ఆవిష్కరణ

టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ ‘ఏస్‌ అగైనెస్ట్‌ ఆడ్స్‌’ను 17 జూలై 2016న ముంబైలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఆవిష్కరించారు.

సాంస్కృతికం

చండీగడ్‌కు వారసత్వ ¬దా

చండీగడ్‌ రాజధాని ప్రాంగణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. సిక్కింలోని కాంచన గంగా జాతీయ ఉద్యానవనం కూడా వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇస్తాంబుల్‌లో 17 జూలై 2016న జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో చండీగడ్‌, సిక్కిం, ఉద్యానవనాలకు ఈ ¬దాను ఇచ్చారు. ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, బెల్జియం, జర్మనీ, అర్జెంటీనా, జపాన్‌, భారత్‌లలోని 17 ప్రముఖ ప్రాంతాలకు తాజాగా యునెస్కో జాబితాలో చోటు దక్కింది.

నలందకు యునెస్కో గుర్తింపు

ప్రపంచంలోనే అతి పురాతనమైన విశ్వ విద్యాలయం నలందను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. బిహార్‌ రాజధాని పట్నాకు 98 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలంద విశ్వ విద్యాలయాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చి నట్లు 15 జూలై 2016న యునెస్కో ప్రకటించింది. క్రీస్తుశకం అయిదో శతాబ్దంలో నిర్మాణమై 800 ఏళ్ళపాటు అంటే 13 శతాబ్దంవరకు నడిచిన ఈ విశ్వవిద్యాలయాన్ని 13వ శతాబ్దంలో తురుష్కులు కూల్చేశారు. కొన్ని వందల ఏళ్ళ తరువాత ఇటీవలే దీన్ని పునరుద్ధరించారు.

నివాళి

సిపిఐ నేత ఉజ్జిణి నారాయణరావు మృతి

సిపిఐ సీనియర్‌ నేత, నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిణి నారాయణరావు 13 జూలై 2016న మృతి చెందారు. నారాయణరావు 1927లో జన్మించారు. 1985, 89, 94ల్లో, వరుసగా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాజకీయాలు

అరుణాచల్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరుద్ధరణ

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు 13 జూలై 2016న కీలక తీర్పు వెలువరించింది. గత జనవరిలో ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన గవర్నర్‌ నిర్ణయాలన్నింటిని కొట్టేసింది. జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మొత్తం 47మంది శాసనసభ్యులుండగా అందులో 21మంది ముఖ్య మంత్రి నబం టుకికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో సంక్షోభం ఏర్పడింది. తదనంతర పరిణామాలలో తిరుగుబాటు నేత కలిఖో పుల్‌ బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సుప్రీం తాజా తీర్పుతో మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరింది.

అరుణాచల్‌ కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండూ

అరుణాచల్‌ ప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పెమాఖండూ 17 జూలై 2016న ప్రమాణస్వీకారం చేశారు. ఖండూ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తథాగత రాయ్‌ ఖండూ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా చౌనామేన్‌ ప్రమాణస్వీకారం చేశారు. పెమాఖండూ దివంగత ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ తనయుడు. తవాంగ్‌కు చెందిన పెమా 2011లో తన తండ్రి దుర్మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని బర్తీ చేయడానికి ఎన్నికల్లో పోటీ చేశారు. ముక్తో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2014లో ఏకగ్రీవంగా నెగ్గి నబుం టుకి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో పెమా కలిఖో పుల్‌కు మద్దతు ప్రకటించాడు. పెమాను బుజ్జగించి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ గూటికి చేరారు.

క్రీడలు

ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రిచెస్‌ విజేత హారిక

గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోనవల్లి హారిక తన కెరీర్లో అతిపెద్ద టైటిల్‌ సాధించింది. చైనాలోని బెంగ్‌డులో 14 జూలై 2016న ముగిసిన ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రిచెస్‌ టోర్నమెంట్‌లో హారిక విజేతగా నిలిచింది. మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో హారిక టైటిల్‌ సాధించింది. ఈ టోర్నీలో 11 రౌండ్లు ముగిసేసరికి హారిక, హంపి చెరొక 7 పాయింట్లతో సమానంగా నిలిచారు. అయితే టోర్నీలో ఒక్క గేమ్‌ కూడా ఓడని హారిక మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో హంపిని వెనక్కి నెట్టి టైటిల్‌ అందుకుంది. హంపి రన్నరప్‌గా నిలిచింది.

ఆసియా పసిఫిక్‌ బాక్సింగ్‌ టైటిల్‌ విజేత విజేందర్‌

ఇప్పటికే ఆరు ప్రోబౌట్లు ఆడి అన్నిట్లో ప్రత్యర్థుల్ని నాకౌట్‌ చేసిన విజేందర్‌ డబ్ల్యూబిఓ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌లో విజయం సాధించాడు. 16 జూలై 2016న దిల్లీలో జరిగిన ¬రా¬రీ పోరులో ఐరోపా మాజీ చాంఫియన్‌ కెర్రీ ¬ప్‌ను మట్టి కరిపించాడు. భారత్‌లో విజేందర్‌ ఆడిన తొలి బౌట్‌ ఇదే. కెర్రీ ¬ప్‌ను ఓడించడానికి విజేందర్‌ బాగా కష్టపడాల్సి వచ్చింది.

అంతర్జాతీయం

బ్రిటన్‌ ప్రధానిగా థెరిసా మే

బ్రిటన్‌ నూతన ప్రధానిగా థెరిసా మే, 13 జూలై 2016న పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్‌ ప్రజలు తీర్పునివ్వడంతో, ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ రాజీనామా చేయడంతో, కన్జర్వేటివ్‌ పార్టీ థెరిసాను ప్రధానిగా ప్రకటించింది. బ్రిటన్‌కు మార్గరేట్‌ థాచర్‌ తర్వాత థెరిసా రెండో మహిళా ప్రధాని. థెరిసా ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం చేశారు. బ్రిటన్‌ చరిత్రలో సుదీర్ఘకాలం ¬ం మంత్రిగా పనిచేశారు.

టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలం

టర్కీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభు త్వాన్ని కూలదోసి అధికారం కైవసం చేసుకు నేందుకు చేసిన యత్నం విఫల మైంది. సైన్యంలోని అసంతృప్త వర్గం చేసిన తిరుగు బాటును ప్రజల అండతో ప్రభుత్వ సైన్యం తిప్పికొట్టింది. అధ్యక్షుడు ఎర్డోగన్‌కు మద్దతుగా ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. ఇస్లాం మత గురువు ఫెతల్లా గులెన్‌ ఈ తిరుగుబాటు వెనుక ఉన్నారు. గులెన్‌ అమెరికాలో ఆశ్రయం పొందు తున్నారు.

ఫ్రాన్సులో ఉగ్రదాడి

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవాన్ని పురస్క రించుకొని నీస్‌ నగరం లో 15 జూలై 2016న జరిగిన బ్యాస్టిల్‌డే వేడుకల్లో ఉన్న జనంపైకి ఉగ్రవాది భారీ లారీని తీసుకెళ్ళి తొక్కించిన ఘటన లో 84 మంది మరణించారు. ట్యునీషియాలో జన్మించిన ఫ్రాన్స్‌ వాసి మొహమ్మద్‌ లహౌమెజ్‌ బౌహైల్‌ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఐరోపా సమాఖ్యలో ముస్లిం జనాభా ఫ్రాన్స్‌లోనే అధికంగా ఉంది. స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిచ్చే ఫ్రాన్స్‌ ఉదారవాదంతో ముస్లింలు అధికంగా అక్కడికి వలసవచ్చి వారి జనాభా పెరిగింది. వారు తీవ్రవాదంవైపు ఆకర్షితులవు తున్నారు.

-రామచంద్రా రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *