రాండాల్‌గ్రే ఆక్రందనను ప్రపంచం వినాలి!

రాండాల్‌గ్రే ఆక్రందనను ప్రపంచం వినాలి!

‘నా సంస్కతి, నా మతం, నా సంప్రదాయాలు అన్నీ తస్కరించబడినై, నాశనం చేయబడ్డాయి. దీనిని నేను ‘టెర్రరిజం’ అంటాను. నేను ఈనాడు నా సంతానానికి ఏ ఆచారం, ఏం సంప్రదాయం అందివ్వగలిగి ఉన్నాను? ఓ మాతదేశం కానీ, ఓ మాతభాష కానీ లేని నేనసలు ఎవర్ని? నన్ను డొరోతీ రాండాల్‌గ్రే అని పిలవకండి, కేవలం తన పేరుకై ఇంకా వెతుక్కుంటున్న ఓ నెచ్చెలిగా గుర్తించండి!’ 2001లో ఢిల్లీలో జరిగిన సర్వ మత సమ్మేళనంలో ఆఫ్రికన్‌- అమెరికన్‌ డొరోతీ అన్న మాటలివి.

ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ఆచారాలు ఉన్నాయి. అదొక వైవిధ్యం. ఈ మతాలను రక్షించుకుని, భద్రంగా పోషించుకోవడం ఎలా అనే అంశం మీద ఆ సమావేశం జరిగింది. మా ప్రవక్తలు చెప్పిన మాటలే గొప్ప, వాటిని పాటించని మతాలను మేం బతకనివ్వం అనే మతాలకు చెందిన వారి మీద, వారు ఆయా మతాలను విస్తరించిన తీరు మీద, దీనితో ప్రపంచంలోని వైవిధ్యం ధ్వంసమైన వాస్తవం ఆ సమ్మేళనంలో పాల్గొన్న పలు దేశాలవారి మాటలలో వ్యక్తమైంది. ‘యూరోపియన్‌ హిందువులు’ అన్న పేరుతో రాసిన వ్యాసంలో నీలంరాజు లక్ష్మీ ప్రసాద్‌ ఈ అంశాలు వెల్లడించారు. ఇలా దెబ్బతిన్న మతాలకు, గాయపడిన సంప్రదాయాలకు వారసులైన వారు అదే సమావేశంలో భారతదేశం గొప్పతనం గురించి ఏ విధంగా శ్లాఘించారో కూడా ఈ వ్యాసంలో రాశారు రచయిత. నిజానికి ‘యూరోపి యన్‌ హిందువులు’ ఒక వ్యాస సంకలనం. ఇందులోని మొదటి వ్యాసం పేరే పుస్తకానికి పెట్టారు. ఈ సంకలనంలో 52 వ్యాసాలు ఉన్నాయి. వాటిలో 20వ వ్యాసం మరీ ప్రత్యేకమైనది. ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ సర్‌ సంఘచాలక్‌ గురూజీ నేపాల్‌లో పశుపతినాథ్‌ను దర్శించుకుని, నేపాల్‌ రాజును ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కోరినప్పుడు పాకిస్తాన్‌, చైనా ఎలా కలవరపడ్డాయో, వాటితో పోటీగా నెహ్రూ మరింతగా ఎలా కలవరపడ్డారో ఈ వ్యాసంలో రాశారు నీలంరాజు. ఈ వ్యాసం పేరు ‘హైందవం, ఆత్మజ్ఞానం’. చాలా విజ్ఞానదాయకమైన వ్యాసాలివి.

యూరోపియన్‌ హిందువులు

రచన : నీలంరాజు లక్ష్మీప్రసాద్‌

పుటలు : 153, వెల : రూ.50/-

ప్రతులకు : నవోదయ, విశాలాంధ్ర

 

-శ్రీరామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *