వారఫలాలు 29 ఏప్రిల్‌-5 మే 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గహ నిర్మాణాలు చేపడతారు. రాబడికి లోటుండదు. అప్పుల బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్వల్ప నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు రాగలవు.పారిశ్రామికవేత్తలకు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నపూర్ణాష్టకం పఠించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. విద్యార్థుల యత్నాలు సఫలం. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు రాదు. అవసరాలకు డబ్బు అందుతుంది. వివాహది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు మరింత సానుకూల ఫలితాలు. విష్ణుధ్యానం చేయండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

నత్తనడకన సాగే కార్యక్రమాలు క్రమేపీ ఊపందుకుంటాయి. గృహ నిర్మాణాలను చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగే సమయం. సొమ్ము అనుకోకుండా అందుతుంది. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆహారవిహారాదులలో పరిమితులు పాటించడం మంచిది. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. శివారాధన మంచిది.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

కొన్నిపనుల్లో అవాంతరాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారులు ఉత్సాహవంతంగా సాగుతారు. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. ఆదిత్య హృదయం పఠించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తారు. వాహన సౌఖ్యం. దేవాలయాలు సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. రుణబాధలు తొలగుతాయి. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు. సమయానికి డబ్బు అందుతుంది. కుటుంబంలోని అందరితోనూ ప్రేమను పంచుకుంటారు. ఆరోగ్యపరంగా మెరుగైన జీవనం సాగిస్తారు. శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. గణేశాష్టకం పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. అందరి అభిమానం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు. కొత్త పెట్టుబడులకు అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు కార్యసిద్ధి. క్రీడాకారులకు పురస్కారాలు. శివపంచాక్షరి పఠనం మంచిది.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న కార్యక్రమాలు జాప్యంతో పూర్తి కాగలవు. ఒక వర్తమానం ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. అనుకున్న విధంగా ధనలాభాలు కలుగుతాయి. అవసరాలకు లోటు లేకుండా సొమ్ము అందుతుంది. మీపై వచ్చిన విమర్శల నుంచి బయటపడతారు. శారీరక రుగ్మతలు కొంత తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలత. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించని స్థితి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు శ్రమానంతరం దక్కుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బందులు పడతారు. కుటుంబసభ్యులు విమర్శలు ఎక్కుపెడతారు. అయినా లెక్కచేయక ముందడుగు వేస్తారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఇబ్బందికరంగా ఉండవచ్చు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ఉత్సాహంతో కార్యక్రమాలు చక్కదిద్దుతారు. నేర్పుతో సమస్యలను అధిగమిస్తారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు మించి డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యం మెరుగుదల. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిశోధకులు, రాజకీయవేత్తలు, కళాకారులు విశేష కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. గణేశస్తోత్రాలు పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోపణలు మోపిన వారే ప్రశంసలు కురిపిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తీరతాయి. వాహన, గృహ యోగాలు. అనుకున్నంత ఆదాయం సమకూరుతుంది. తండ్రి తరఫు నుంచి ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారులకు లాభాలు. పెట్టుబడులకు లోటుండదు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. సన్మానయోగం. లక్ష్మీస్తుతి మంచిది.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంలోని అందరితోనూ ప్రేమతో మసలుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకున్న ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *