వారఫలాలు 10 -16 జూన్ 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

అనుకున్న పనులు చక్కదిద్దుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు ఈతి బాధలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టిందిబంగారమే. 12,13 తేదీలలో వృథా ఖర్చులు. లేనిపోని అపవాదులు, విమర్శలు. శారీరక రుగ్మతలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

అనుకున్న పనులు కొంత నిదానంగా పూర్తిచేస్తారు. ఒత్తిడులు వచ్చినా అధిగమిస్తారు. మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదాయానికి లోటుండదు. కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు ఉన్నతవ్యక్తుల సహాయం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నూతనోత్సాహం. 10,11 తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఖర్చులు అధికం. శివాష్టకం పఠించండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

పరిమితికి మించిన ఖర్చులు భరించాల్సిన పరిస్థితి. అయినా లెక్కచేయకుండా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన, కుటుంబ సౌఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. 13,14 తేదీల్లో ధననష్టం. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

అప్పులు చేయాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఎంత యత్నించినా లక్ష్యం చేరుకోలేని పరిస్థితి. వ్యాపారస్తులకు ఇబ్బందులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు విధి నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలి. 12,13 తేదీలలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి వాహనాలు, స్థలాలు కొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. శత్రువులు కూడా అనుకూలురుగా మారవచ్చు. విద్యార్థుల కలలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనూహ్యమైన లాభాలు. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. విష్ణుధ్యానం మంచిది.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం. సమయానికి డబ్బు అందుతుంది. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితల నిరీక్షణ ఫలిస్తుంది. 10,11 తేదీలలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

నూతన కార్యక్రమాలు చేపడతారు. సమాజసేవలో పాల్గొంటారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. శత్రువిజయం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశాంతత. రాజకీయవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన విజయాలు చేకూరతాయి. 13,14 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకూలమైన సమయం. ఆదాయం మరింత పెరుగుతుంది. నిర్భయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారస్తుల అంచనాలు నిజమై లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహం. 14,15 తేదీల్లో దుబారా వ్యయం. మానసిక అశాంతి. అనారోగ్యం. గణేష స్తోత్రాలు పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

దీర్ఘకాలిక వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. వివాహ వేడుకల నిర్వహణలో భాగస్వాములవుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు సఫలం. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగస్తులకు హోదాలు. 15,16 తేదీల్లో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో తగాదాలు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు. ఆదాయానికి లోటుండదు. ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. 11,12 తేదీల్లో మానసిక అశాంతి. దూరప్రయాణాలు. ఖర్చులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

ఈ వారం మిశ్రమంగా కొనసాగుతుంది. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవు తాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వాహనాల విషయంలో కొంత జాగ్రత్త మంచిది. విద్యార్థులు మరింత శ్రమపడాలి. వ్యాపారస్తులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న మార్పులు. 14,15 తేదీలలో ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. కనకధారా స్తోత్రం పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేసి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం కొంత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు మరిన్ని లాభాలు. ఉద్యోగస్తులకు కోరుకున్న బదిలీలు. 15,16 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *