వారఫలాలు 08-14 జూలై 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. గృహయోగ సూచనలు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారులు మరిన్ని లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతమైన సమయం. 13, 14 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దూర ప్రయాణాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. అనుకున్నది సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు. 8,9 తేదీలలో బంధు విరోధాలు, అనారోగ్యం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

అనుకున్న పనులు ముందుకు సాగవు. అయితే సోదరుల సహాయంతో కొన్ని వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగయత్నాలు కొంతమేర ఫలిస్తాయి. నేర్పు, ఓర్పుతో గడపడమే మంచిది. ఉద్యోగస్తులకు ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. 12,13 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు సంభవం. ఆస్తి వివాదాల పరిష్కారంలో పురోగతి కనిపిస్తుంది. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు. 14,15 తేదీల్లో వాహనయోగం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. రాబడి అంతంత మాత్రమే. ప్రయాణాలలో మార్పులు చేసుకుంటారు. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు ఇష్టంలేని మార్పులు పొందుతారు. 10,11 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆంజనేయ దండకం పఠించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. అనుకున్న రాబడి దక్కి మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. 11, 12 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

మీ ప్రేమాభిమానాలు పొందినవారే విమర్శలకు దిగుతారు. ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. మీ నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. శారీరక రుగ్మతలు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. 10, 11 తేదీల్లో విందు వినోదాలు. కార్యజయం. భూలాభాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. మీ సత్తా, ధైర్యంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం మరింత పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు కొంతమేర పరిష్కరించకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు దక్కుతాయి. 11, 12 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

ఆదాయానికి లోటుండదు. పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు అందరూ గౌరవిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. 13, 14 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శివపంచాక్షరి పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

రుణభారాల నుంచి కొంత విముక్తి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు పొందుతారు. 9, 10 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

ఆదాయానికి మించి ఖర్చులు. తరచూ ప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. 12,13 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందక కొంత ఇబ్బంది పడతారు. దూరప్రయాణాలు చేస్తారు. ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు విధులు. 8, 9 తేదీలలో విందు వినోదాలు. వాహనయోగం. గణేశాష్టకం పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *