వారఫలాలు 08-14 ఏప్రిల్‌ 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

ఇంతకాలం పడిన కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి లక్ష్యాలు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల సందడితో గడుపుతారు. కొన్ని పనులు సజావుగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభసమయం వైద్యులు, క్రీడాకారుల కృషి ఫలించి విశేష ఆదరణ పొందుతారు. హనుమంతుడికి ఆకుపూజలు చేయండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శత్రువులను కూడా స్నేహితు లుగా మార్చుకుంటారు. కీలక నిర్ణయాలలో సన్నిహితులతో మంతనాలు జరుపుతారు. మీ అభికృద్ధిలో కుటుంబసభ్యుల పాత్ర పెరుగుతుంది. ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వృత్తి, వ్యాపారా లలో ముందడుగు వేస్తారు. శాస్త్రవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సలహాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శారీరక రుగ్మతలు ఏర్పడినా సర్దుబాటు కాగలదు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితి ఉంటుంది. దేవీస్తోత్రాలు పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం సమకూరుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనసౌఖ్యం. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. నాయకులు, పారిశ్రామిక వేత్తలకు విజయాలు చేకూరుతాయి. అన్నపూర్ణాష్టకం పఠించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం కొంత మంద గిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహ వంతంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.విష్ణుధ్యానం చేయండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల ప్రత్యర్థుల్ని అనుకూలంగా మార్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ఆరోగ్యపరమైన చికాకులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. క్రీడాకారులు అనుకున్న ప్రగతి సాధిస్తారు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కేసులో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల స్వప్నం ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగానే సాగుతాయి. కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు రాగలదు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కార మవుతాయి. సోదరులతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు గుర్తింపు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆదిత్య హృదయం పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ఇంతకాలం పడిన శ్రమ ఫలించి ఊరట లభిస్తుంది. అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి కాగలవు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు, వైద్యులను విజయాలు వరిస్తాయి. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

శ్రమ ఫలిస్తుంది. రాబడి పెరుగుతుంది. ఆదాయం కొంత పెరిగి రుణబాధలు తొలగుతాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయట పడతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో అకారణంగా వైరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకుసాగవు. తరచూ ప్రయాణాలు. శారీరక రుగ్మతలు బ్యాధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. వేంకటేశ్వర స్వామిని పూజించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *