వారఫలాలు 22-28 ఏప్రిల్‌ 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

నూతన మిత్రులు పరిచయమవుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆదాయం సమద్ధిగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ముఖ్య సమాచారం అందుతుంది. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. వ్యాపారాలు పురోగతితో సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ, సాంకేతికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, రచయితలు సంతప్తిగా ఉంటారు. గణపతిని పూజించండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల పరిచయంతో మరింత ఉత్సా హంగా సాగుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. రాజకీయ, సాంకేతిక వర్గాలకు నూతనోత్సాహం. పరిశోధకులు, కళాకారులకు అవార్డులు అందుతాయి. దుర్గాస్తోత్రాలు పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. స్థలాలు, గహం కొనుగోలు చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రచయితలు, పరిశోధకులు, వైద్యులకు మరింత అనుకూల సమయం. ఆంజనేయ దండకం పఠించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్నేహితులతో వివాదాలు తీరతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు పట్టింది బంగారమే. విస్తరణ కార్యక్రమాలు సఫలం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు ఫలిస్తాయి. ఆదిత్య హదయం పఠించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో మీకు ఎదురుండదు. స్థలాలు, వాహనాలు కొంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతప్తినిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నవగ్రహ స్తోత్రం పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాల్లో ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తాయి. రాబడి తగ్గి రుణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలలో చిక్కులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు అంచనాలు తప్పుతాయి. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కాంట్రాక్టులు కూడా దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు, బాధ్యతలు కొంత తగ్గుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి అనుకోని అవకాశాలు. కళాకారులకు సన్మానయోగం, విదేశీ పర్యటనలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

ఆదాయం సమకూరి అప్పులు తీరుస్తారు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. భూవివాదాలు తీరతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో అవాంతరాలు తొలగుతాయి. పరిశోధకులు, కళాకారులకు చిక్కులు తొలగుతాయి. లక్ష్మీ నసింహస్తోత్రాలు పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. రాబడికి లోటు ఉండదు. కొన్ని రుణాలు సైతం తీరతాయి. స్నేహితులు మీ అభివద్ధికి సహకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని ప్రమోషన్లు దక్కుతాయి. కళాకారులు, రచయితలు అనుకున్నది సాధిస్తారు, విద్యార్థులకు నూతన అవకాశాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

ఉద్యోగయత్నాలు అనుకూలించవచ్చు. ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. ఒక సంఘటన లేదా ప్రకటన ఆకట్టుకుంటుంది. వేడుకల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. తీర్థయాత్రలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఖాయం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. స్థలాలు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఊహలు నిజం కాగలవు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. కళాకారులు, రచయితలు, వ్యవసాయ దారులకు అంచనాలు నిజమవుతాయి. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *